కరోనా ..కరోనా ..కరోనా ..ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి ..అక్కడినుండి ఒక్కో దేశం విస్తరిస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని 130 దేశాలకి పాకింది. ఇక పొతే ఈ కరోనా వల్ల చాలా రంగాలు తమ ప్రణాళికలలో మార్పులు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ కరోనా వైరస్ అన్ని దేశాల క్రీడారంగాలపై భారీ ప్రభావం చూపిస్తోంది . ఈ కరోనా వల్ల ఇప్పటికే ఎన్నో రకాల క్రీడా టోర్నమెంట్స్ రద్దు అయ్యాయి. కొన్ని టోర్నమెంట్స్ ని ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని చూసినా కూడా ఆ తరువాత వాటిని కూడా రద్దు చేసారు. ఇక తాజాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ని కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం ఇలా ఉంటే .. తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. కివీస్ జట్టు పేస్ బౌలర్ లూకి ఫెర్గుసన్ తనకు గొంతు నొప్పి, జలుబు ఉందని చెప్పడంతో , వెంటనే అప్రమత్తమైన అధికారులు లూకి ఫెర్గుసన్ ని ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని జట్టు అధికారి ఒకరు వెల్లడించారు. నిన్న జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై 71 పరుగుల తేడాతో కివీస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ తర్వాత తనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు ఫెర్గుసన్ చెప్పడంతో , అతనిని ఐసోలేషన్ కు తరలించి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం అతనికి కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ లో కరోనా నెగటివ్ అని వస్తే ..మళ్లీ కివీస్ జట్టుతో కాలుస్తాడు. అలాగే ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్ సన్ కు కూడా మొదటి వన్డే ముందు కరోనా లక్షణాలు ఉన్నాయి అని చెప్పడంతో .. తొలి వన్డే ముందు కరోనా టెస్టులు జరిపారు. అయితే , ఆ రిపోర్ట్స్ లో కేన్ రిచర్డ్ సన్ కి కరోనా నెగటివ్ అని వచ్చింది. దీనితో ఆసీస్ టీం ఊపిరి పీల్చుకుంది.