భారీ అంచనాలతో బ్యాటింగ్ కు దిగి పంజాబ్ కింగ్స్ జట్టు విఫలమవుతుందని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్ పై అనవసర ఒత్తిడి పెంచుతున్నారని పేర్కొన్నారు. ప్రతి సారి 180, 190 పరుగుల లక్ష్యంతోనే పంజాబ్ బ్యాటింగ్‌కు దిగుతోందని ఇది ఏ మాత్రం సరికాదని ఆయన చెప్పాడు. ‘నికోలస్ పూరన్, క్రిస్ గేల్ అద్భుతమైన ఆటగాళ్లు.. కానీ వాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవడంలో పంజాబ్ విఫలమవుతోంది. పూరన్ మీద అనవసరపు ఒత్తిడిని పెంచుతున్నారు.
నిజానికి పూరన్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్. అతడి స్ట్రయిక్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భారీ స్కోరు చేయాలంటూ అతడిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో అతడు వెంట వెంటనే వెనుదిరుగుతున్నాడు. ఓపెనర్లు రాహుల్, మయాంక్ ఓ స్పష్టమైన ఇన్సింగ్స్ ఆడాక.. నికోలస్ పూరన్, గేల్ పై ఎటువంటి ఒత్తిడి లేక పోతే వాళ్లు మంచి స్కోరు తీసుకొస్తారు.
గత ఐపీఎల్ సీజన్ లో మ్యాక్స్‌వెల్ పంజాబ్ తరఫున ఆడాడు. అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉండేది. దీంతో సరిగ్గా ఆడలేకపోయాడు. ప్రస్తుతం క్రిస్‌గేల్, పూరన్ మీద కూడా అటువంటి ఒత్తిడే ఉంది. ప్రతి బ్యాట్స్‌మెన్ కు ఓ సహజసిద్ధమైన బ్యాటింగ్ స్టయిల్ ఉంటుంది. వాళ్లను ఆ లైన్ లోనే ఆడనివ్వాలి. అంతేకాని వాళ్ల మీద అనవసర ఒత్తిడి తీసుకొస్తే అసలుకే మోసం వస్తుంది. నికోలస్ పూరన్, గేల్ విషయంలో అదే జరుగుతోంది.
జట్టు కెప్టెన్, సూచన మేరకు వాళ్లు దూకుడు తగ్గించి నెమ్మదిగా ఆడేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనయి పెవిలియన్ బాట పడుతున్నారు’ అని ఓజా పేర్కొన్నారు. సోమవారం పంజాబ్ కింగ్స్ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఆరంభంలోనే రాహుల్ అవుటయ్యాడు.
ఆ తర్వాత క్రిస్ గేల్ కూడా డకౌట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ మీద తీవ్రమైన ఒత్తిడి పడింది. ఈ క్రమంలో వాళ్లు కూడా వెనువెంటనే వెనుదిరిగారు. మయాంక్ 31 పరుగులు, జోర్డాన్ 30 పరుగులు మినహా.. పంజాబ్ జట్టులో ఎవరూ ఆశించిన మేర రాణించలేదు. దీంతో కేవలం ఆ జట్టు 123 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రారంభం లో తడబడ్డ కోల్‌కతా నైట్ రైడర్స్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో కేవలం కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.