హీరోయిన్‌.. క్రికెటర్‌ పెళ్లి ముహూర్తం ఫిక్స్

Update: 2023-01-12 13:30 GMT
టీం ఇండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మరియు హీరోయిన్‌ అనుష్క శర్మ పెళ్లి పీఠలు ఎక్కి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. క్రికెటర్స్ మరియు బాలీవుడ్‌ హీరోయిన్స్ ప్రేమలో పడటం చాలా కామన్‌ విషయం. గత కొన్నాళ్లుగా టీం ఇండియా క్రికెటర్‌ కేఎల్ రాహుల్ మరియు హీరోయిన్ అతియా శెట్టి లు ప్రేమలో ఉన్నారనే విషయం తెల్సిందే.

సునీల్ శెట్టి కూతురు అయిన అతియా శెట్టి ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటుంది. ఈ సమయంలో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ప్రేమ పక్షుల మాదిరిగా విహరిస్తున్న వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కే ముహూర్తం ఖరారు అయ్యింది.

కేఎల్‌ రాహుల్‌ మరియు అతియాల వివాహం ఈనెల 23వ తారీకున జరగబోతుంది. సునీల్‌ శెట్టి కి చెందిన ఖండాలాలోని ఇంట్లో ఈ వివాహం జరగబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 21 నుంచి 23వ తారీకు వరకు పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి.

వీరిద్దరి వివాహానికి పలువురు క్రికెటర్స్ మరియు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. వీరి వివాహానికి బాలీవుడ్‌ ప్రముఖులను ఇప్పటికే ఆహ్వానించారని తెలుస్తోంది. కోహ్లీ మరియు అనుష్క ల మాదిరిగా వీరిద్దరు కూడా వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News