ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడివాడలో పోటీ చేస్తే ఓడిపోతారా...? అక్కడి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడిస్తారా..? అంత సీనుందా? అంటూ టీడీపీ వర్గాలు సరదాగా చర్చించుకుంటున్నాయి. దీనికి కారణం కొడాలి నాని.. చంద్రబాబుకు సవాల్ విసరడమే. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని నాని చంద్రబాబుకు సవాల్ విసిరారు. గుడివాడలో వైసీపీ కార్యాలయానికి తాళం వేసిన నేపథ్యంలో జరుగుతున్న వివాదంలో నాని ఇలా చంద్రబాబుపై విమర్శలకు దిగి సవాళ్లు విసురుతున్నారు. నాని సవాళ్లు వింటున్న టీడీపీ నేతలు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.
గుడివాడలో వైసీపీ కార్యాలయానికి తాళం వేయించడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందంటూ నాని ఆరోపిస్తున్నారు. తనకు ఆ బిల్డింగు యజమానికి రెండు రోజుల కిందట ఖాళీ చేయమని చెప్పారని... తాము ఇంకా ఖాళీ చేసేలోగానే తాళం వేశారని... ఇదంతా టీడీపీ ప్రోద్బలంతోనే జరుగుతోందని నాని ఆరోపిస్తున్నారు. ఈ సివిల్ వివాదంలో పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని ఆయన అంటున్నారు. ఎన్టీఆర్ ఫొటో పక్కన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టినందుకే అదికార పక్షం పోలీసులను ఉపయోగించి ఇలా తనను ఇబ్బంది పెడుతోందని ఆయన మండిపడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా చంద్రబాబును గుడివాడలో పోటీ చేసి గెలవమనడం మాత్రం అందరిలోనూ సరదా చర్చకు దారితీస్తోంది. గుడివాడలో నాని బలవంతుడే అయినప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో చంద్రబాబుపై ఆయనకు గెలించేంత సీనుందా అని అంటున్నారు. గుడివాడలో పరిణామాలు చూస్తుంటే అక్కడ నాని హవా తగ్గుతున్నట్లుగానే ఉంది.