అధికార తెలుగుదేశం పార్టీపై, ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడ్డారు. కృష్ణాజిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఎమ్మెల్యే కొడాలి మాట్లాడుతూ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు చెబితే భయపడతారని అన్నారు. అవసరమైతే కాళ్ళు - లేదంటే జుట్టు పట్టుకునే స్వభావం చంద్రబాబుదని మండిపడ్డారు. చంద్రబాబు పిల్లనిచ్చిన మామనే కాదు, కన్న కొడుకును కూడా అధికారం కోసం వెన్నుపోటు పొడుస్తాడని కొడాలి నాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ - కాళ్ళు పట్టుకుని అధికారం లోకి వచ్చిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.
సోషల్ మీడియాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి సాగుతున్న దుష్ప్రచారంలో నిజం లేదని కొడాలి నాని తెలిపారు. కింది నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించే గుణం వైఎస్ జగన్ దని తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ చంద్రబాబును కూడా వైఎస్ జగన్ `చంద్రబాబు గారు` అనే సంబోధిస్తారని కొడాలి నాని తెలిపారు. అయినప్పటికీ పలువురు విమర్శలు చేయడం చిత్రంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన వారిపై కొడాలి నాని మండిపడ్డారు. అధికార పార్టీని ఎదుర్కోలేని చవటలు, దద్దమ్మలే పార్టీ ఫిరాయించారని మండిపడ్డారు. అటువంటి వారు ఉన్నా...పార్టీని విడిచిపెట్టిన ఒక్కటేనని నాని తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టు ను తక్షణం పూర్తి చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ డెల్టా ప్రజల పాలిట దివంగత సీఎం వైఎస్ ఆర్ మరో కాటన్ దొర అవుతారని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. అందుకే పులిచింతలను చంద్రబాబు పక్కకు పెట్టారని కొడాలి నాని తెలిపారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నమూనా కూడా పులిచింతల ప్రాజెక్ట్ ను పోలి ఉండటం వల్లే ఆ విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గం ను రైతులకు వివరించాలని పార్టీ నేతలకు వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/