బాబు వ‌య‌సు పాతికేళ్లే..స‌భ‌లో న‌వ్వులే న‌వ్వులు!

Update: 2019-12-10 15:42 GMT
ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల రెండో రోజు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అది కూడా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు  - టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌య‌సుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆస‌క్తిక‌ర సంభాష‌ణ  చేశారు. తొలుత‌ ఉల్లి పాయ‌ల కొర‌త‌ - ధ‌ర‌ల‌పై చ‌ర్చ సాగింది. ఈ సంద‌ర్భంగా గుడివాడ‌లో ఓ రైతు ఉల్లిపాయ‌ల కోసం వ‌చ్చి లైన్‌ లో నిల‌బ‌డి మృతి చెందిన విష‌యాన్ని చంద్ర‌బాబు స‌భ దృష్టికి తెచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్న గుడివాడ ఎమ్మెల్యే - మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకుని - చంద్ర‌బాబుకు అబ‌ద్దాలు చెప్ప‌డం పోలేద‌ని అన్నారు.

ఇంత వ‌య‌సు వ‌చ్చినా.. చంద్ర‌బాబు మాత్రం మార‌లేదు! అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే నాని.. చంద్ర‌బాబుకు డెబ్బై ఏళ్లు వ‌చ్చాయంటూ.. మాట్లాడారు. డెబ్బ‌య్యేళ్లు వ‌చ్చినా కూడా బాబులో ఎక్క డా పాజిటివ్ ఆలోచ‌నే లేద‌ని - ఎంత సేపూ జ‌గ‌న్‌ పైనా - మా పైనా విమ‌ర్శ‌లు చేయాల‌నే చూస్తున్నాడంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు.. త‌న వ‌య‌సు గురించి కూడా రాజ‌కీయం చేస్తున్నారంటూ.. ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు ఎంత వ‌య‌సున్నా.. త‌న ఆలోచ‌న‌లు మాత్రం పాతికేళ్ల వ‌య‌సులో ఉన్న‌వారితో పోటీ ప‌డ‌తాయ‌ని - అందుకే తాను వినూత్నంగా ఆలోచిస్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

దీంతో వైసీపీ స‌భ్యులు జోక్యం చేసుకుని చంద్ర‌బాబు వ‌య‌సుపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. చంద్ర‌బాబు వ‌య‌సు పాతికేళ్ల వాళ్ల‌తో పోటీ ప‌డుతున్న మాట నిజ‌మేన‌ని - ఆయ‌న కుమారుడు లోకేష్ వ‌య‌సు మాత్రం డెబ్బై ఏళ్ల వాళ్ల‌తో పోటీ ప‌డుతోంద‌ని అంబ‌టి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపైనే బాబును రోజా కూడా ఆడేసుకున్నారు. బాబుకు ఎన్నేళ్లు ఉండి ఏం ప్ర‌యోజ‌నం అంద‌రితోనూ తిట్టించుకుంటున్నార‌ని - ప్ర‌భుత్వానికి ఒక్క సూచ‌న‌ - స‌ల‌హా కూడా ఇవ్వ‌లేని పొజిష‌న్‌ లో ఆయ‌న ఉన్నార‌ని ఆమె విమ‌ర్శించారు. మొత్తంగా చంద్ర‌బాబు వ‌య‌సుపై దాదాపు పావుగంట‌కు పైగానే స‌భ‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వెలువ‌డ‌డంతో స‌భ్యులు న‌వ్వుల్లో మునిగిపోయారు.


Tags:    

Similar News