నిమ్మగడ్డకు మంత్రి కొడాలి నాని ఇచ్చిన వివరణ ఇదీ

Update: 2021-02-12 12:40 GMT
ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న నిమ్మగడ్డ రమేశ్ పై ఇటీవల మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్.. మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు పంపాడు.  వీటికి తాజాగా మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చాడు. తాను ఎస్ఈసీ నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

టీడీపీ అరాచకాల్ని వివరించడానికే ప్రెస్‌మీట్‌ నిర్వహించానని, ఉద్ధేశపూర్వకంగా ఎస్ఈసీని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొడాలి తెలిపారు.తన వ్యాఖ్యల్ని ఎస్ఈసీ అపార్ధం చేసుకున్నారని  కొడాలి వివరణ ఇచ్చారు. తాను ప్రెస్‌మీట్లో చేసిన వ్యాఖ్యల నిజమైన భావాన్ని ఎస్‌ఈసీ అర్ధం చేసుకోలేదని కొడాలి నాని తెలిపారు.  

ఎస్ఈసీ నిమ్మగడ్డ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులో తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు అవాస్తవమని మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. రాజ్యాంగ బద్ధ సంస్ధలంటే తనకు ఎంతో గౌరవమని, ముఖ్యంగా ఎస్ఈసీ అంటే తనకు గౌరవమని మంత్రి కొడాలి పేర్కొన్నారు.

అంతకుముందు ప్రెస్ మీట్లో చంద్రబాబు, నిమ్మగడ్డ ఎవరు అడ్డొచ్చినా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉంటాయని.. వీరంతా జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమని కొడాలి నాని నిప్పులు చెరిగారు. దీంతో ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాని వివరణ ఇవ్వడంతో తదుపరి చర్యలను ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకునే అవకాశం ఉంది.
Tags:    

Similar News