ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో వైసీపీ -టీడీపీ మధ్య ఎప్పటిలాగానే మాటల యుద్ధం జరుగుతుంది. దీనితో గత మూడు రోజులుగా అసెంబ్లీ విమర్శలు , ఆరోపణలతో అట్టుడుకుంది. ఇక అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నేడు సివిల్ సప్లైస్ మినస్టర్ కొడాలి నాని మాట్లాడుతూ ..లోకేష్ పై సెటైర్ వేశారు. దీనితో సభలో మరోసారి నవ్వులు వికసించాయి. ఇంతకీ మంత్రి నాని లోకేష్ ని ఏమన్నాడు అంటే ? చూద్దాం ..
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తారాల సమయం లో ఆదిరెడ్డి భవాని వైసీపీ ని ప్రశ్నిస్తూ ... రాష్ట్రం లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమి కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అంటూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రసంగించారు. పప్పులు నిప్పులయ్యాలని..వంట నూనె, కూరగాయల ధరలు చుక్కలంటాయని, వీటికి తోడు తాజాగా ఆర్టీసీ బస్సు టికెట్స్ ధరలు కూడా పెంచారు అంటూ వైసీపీ పై విరుచుకుపడింది. వైసీపీ నేతలకి టీడీపీ నేతలని విమర్శించడం తప్ప ..ప్రజల గురించి ఆలోచనే లేదు అని అన్నారు. అలాగే గత ఆరు నెలలకు ముందు ఉన్న ధరలు, ఇప్పుడు ఉన్న ధరలను ఆమె సభలో చదివి వినిపించారు. కందిపప్పు గతంలో రూ.72 ఉండగా..ఇప్పుడు 110 అయిందని..వేరు శనగలు అప్పుడు రూ.98 ఉండగా ఇప్పుడు రూ.120 అయ్యాయని..ఉల్లి అయితే ఏకంగా రూ. 40 నుంచి, రూ 120 కు వెళ్లిందని చెప్పారు.
ఇక ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర సరఫరాల శాఖ మంత్రి కోడలి నాని మాట్లాడుతూ ..ప్రతిపక్షం చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు అని , ప్రభుత్వం చేసే మంచి మాత్రం వారికీ కనిపించదు అని , సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా నిత్వావసరాల ధరలు 10 శాతం పెరుగుతాయని, అవి పెరుగుదల కింద పరిగణ లోకి తీసుకోరని తెలిపారు. ఈ సమయం లో పప్పుల రేట్ల గురించి మాట్లాడారు .. వెనక ఉన్న సభ్యులు ఏ పప్పు అని సరదాగా అడగ్గా ..ఆ పప్పు కాదులేండి , కందిపప్పు అంటూ మంత్రి చెప్పారు. ధరల పెరుగుదల రాష్ట్రం లో మాత్రమే కాదని, దేశ వ్యాప్తంగా డిమాండ్ ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయన్నారు. అలాగే ఉల్లి రేటు ఎక్కువగా ఉంటే , ప్రభుత్వమే రూ. 25 కే రైతు బజార్ల ద్వారా ప్రజలకి అందిస్తున్నట్టు తెలిపారు.