రాజకీయాల్లో ఏదీ శాశ్వితం కాదు. ఈ చిన్న విషయం అంత పెద్ద కొడాలి నానికి తెలియంది కాదు. ఆవేశం వస్తే.. నా అంతటోడు లేదన్నట్లుగా పచ్చి బూతులు మాట్లాడేస్తూ.. విరుచుకుపడటం అలవాటుగా మార్చుకున్న మంత్రి కొడాలి నానిలో ఆత్మవిశ్వాసం అంతకంతకూ ఎక్కువైపోతోంది.
దివంగత వైఎస్ లాంటి వారి చేతికి అధికారం రావడానికి ఎన్ని ఏళ్లు పట్టిందో తెలియంది కాదు. అలాంటిది ఇప్పుడున్న అధికారం ఎంత వరకు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందునా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తూ.. జగన్ ప్రభుత్వాన్ని దెబ్బేస్తున్న కొడాలి నాని లాంటి వాళ్లు.. నలుగురైదుగురు ఉంటే చాలు.. ఇక పని అయినట్లేనని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతుంటే ఆయన ఎప్పటికి గుర్తిస్తారో?
సీఎం పదవి నుంచి జగన్మోహన్ రెడ్డిని దించి.. నువ్వు కుర్చీ ఎక్కితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాజాగా కొడాలి నాని చంద్రబాబుకు సవాల్ విసిరిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. బాబుకు సవాల్ విసరటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. సవాలు విసిరితే విసరాలి కానీ.. మధ్యలో జగన్ ప్రస్తావన ఎందుకు తేవాలి? అని ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో ఇదే కృష్ణా జిల్లాకు చెందిన లగడపాటి సైతం తెలంగాణ వస్తే.. రాజకీయ సన్యాసం అన్నారు. తర్వాతేం జరిగింది? అదే తీరులో కొడాలి నాని సవాల్ ఉందంటున్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణనే సాకారం అయినప్పుడు.. నెంబర్ గేమ్ గా ఉండే ఎన్నికల రాజకీయంలో ఎవరు ఎప్పుడు రాజు అవుతారో చెప్పటం అంత సులువు కాదు. అందుకు 2014 ఎన్నికలే నిదర్శనం. స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయిన వాస్తవాన్ని కొడాలి నాని మర్చిపోకూడదు. ఆత్మవిశ్వాసం ఉండాలి. అది మితిమీరినట్లుగా ప్రజలు భావిస్తే.. ఫలితం భిన్నంగా ఉంటుంది.
నిజానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు.. అమలు చేస్తున్న నవరత్నాల ఇమేజ్ మొత్తాన్ని.. కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. మంత్రి అనిల్ లాంటి వారి దూకుడుతనంతో జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదన్న టాక్ ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసిన ఉదంతాలు చూస్తే.. అవన్నీ వీరి పుణ్యమేనన్న మాట పార్టీ వర్గాలు అభిప్రాయపడుతుంటాయి.
ఇప్పటికే వీరు చేస్తున్న రచ్చ సరిపోనట్లుగా.. ఇప్పుడు ఇలాంటి సవాళ్లను విసరటం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబును విమర్శిస్తే.. సజ్జల.. విజయసాయి.. ఎస్వీ సుబ్బారెడ్డి.. బొత్స.. ధర్మాన లాంటోళ్లు చేయాలే తప్పించి.. ఏళ్లకు ఏళ్లు చంద్రబాబు వెనక తిరిగి.. అవసరం.. అవకాశం చూసుకొని పార్టీ మారిన కొడాలి నాని లాంటి వాళ్లు మాట్లాడే మాటలతో ఏపీ అధికారపక్షానికి లాభం కంటే నష్టమే ఎక్కువ.
ఈ విషయాన్ని కొడాలి నాని ఎప్పటికి అర్థం చేసుకుంటారో? తన నోటి నుంచి ఆవేశపూరితమాటలతో పార్టీకి భారీ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారే తప్పించి..తన కారణంగా జరుగుతున్న డ్యామేజ్ ఎంతన్నది.. గ్రామస్థాయిలో సర్వే చేయించుకుంటే.. మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటం ఖాయం. ఇప్పటికైనా కొడాలి నాని వారు.. తన అవాకులు.. చవాకుల్ని కాస్తంత తగ్గించుకుంటారా?