గుంటూరులో నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తొలిరోజున మాట్లాడినవారిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రసంగం ఆ పార్టీ అభిమానులను, శ్రేణులను కట్టిపడేసింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం - జగనే సీఎం అని చెప్పిన ఆయన అందుకు కొనసాగింపుగా మరో మాట కూడా చెప్పడంతో విజిళ్లు - చప్పట్లతో ప్లీనరీ ప్రాంగంణం దద్దరిల్లిపోయింది. 2019లో జగన్ సీఎం అయిన తరువాత ఆయన జీవితకాలమంతా సీఎంగానే కొనసాగుతారని నాని అనడంతో నేతలు - కార్యకర్తలు - అభిమానులు చప్పట్ల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా నాని చంద్రబాబును - ఆయన ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. రుణమాఫీ పేరు చెప్పి చంద్రబాబు దొంగహామీలిచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు. అంతేకాదు... చంద్రబాబుకు ఏజ్ బార్ అయిపోయిందని, ఆయన తరువాత లోకేశ్ ఆ పార్టీని ముంచేయడం ఖాయమని అన్నారు. పార్టీతోపాటు మునిగిపోకుండా బతుకుజీవుడా అని బయటపడాలనుకుంటే వైసీపీలోకి రావడమొక్కటే మార్గమని ఆయన అన్నారు.
ప్లీనరీలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఆయన చంద్రబాబు పాలనలో అరాచకాలపై మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయిననాటి నుంచి వైఎస్ ఆర్ సీపీ శ్రేణులను వేధించడం ప్రారంభించారని, పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు... వైసీపీలో అంతా సత్తా ఉన్న నేతలే ఉన్నారని... దద్దమ్మలంతా టీడీపీలో చేరారని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సెటైర్లు వేశారు. జగన్ అధికారంలోకి వస్తే అన్ని రంగాల వారి అభివృద్ధి జరుగుతుందన్నారు.