కృష్ణా జిల్లా గుడివాడలోని వైకాపా కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగడం రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. ప్రజలు నానిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బుద్దా వెంకన్నతో పాటు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కొడాలి నానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొంతకాలంగా భవనం ఖాళీ చేయమని చెప్పినా కొడాలి నాని ఖాళీ చేయడం లేదని, అద్దె ఇవ్వడం లేదని భవన యజమానురాలు ఆరోపిస్తున్నారు. పోలీసులు భవనానికి తాళం వేసి యజమానురాలికి అప్పగించిన విషయం తెలిసిందే.
గుడివాడలో వైసిపి కార్యాలయం ఉన్న భవనం విషయమై ఆదివారం నుంచి గొడవ జరుగుతోన్న విషయం తెలిసిందే. భవనాన్ని ఖాళీ చేయాలని యజమానులు... కొడాలి నానికి గతంలో చెప్పారు. ఆయన ఖాళీ చేయక పోవడంతో ఆదివారం తాళం వేసుకున్నారు. ఆదివారం నాడు నాని కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో యజమానులు - పోలీసులతో కొడాలి నాని వాగ్వాదానికి దిగారు. దీంతో, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని, సాయంత్రం విడుదల చేశారు. అయితే, కొడాలి నాని భవనంలోకి తిరిగి వెళ్లేందుకు సోమవారం ప్రయత్నించారు. అవసరమైతే తాను తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్తానని సవాల్ చేశారు. దీంతో, టిడిపి నేతలు బుద్దా వెంకన్న తదితరులు సోమవారం ఉదయం భవనం వద్దకు చేరుకున్నారు. నానికి, వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.