ఏపీలో ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ శాతం ఫలితాలు రావడంతో చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. సోషల్ మీడియాలో సెటైర్లతో హోరెత్తిస్తున్నాయి. రకరకాల కామెంట్లతో ఎద్దేవా చేస్తున్నాయి. ఇక మొన్నటికి మొన్న ఓ పదో తరగతి కుర్రాడికి 171 మార్కులే వచ్చినా.. పాస్ అని పేర్కొనడంపై మరింత సంచలనం రేపింది.
దీనిపై ప్రభుత్వ సలహాదారే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక టెన్త్ ఫలితాల అంశంపై విద్యార్థులతో గురువారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జూమ్ కాల్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం మధ్యాహ్నం విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతుండగా.. ఆశ్చర్యకర ఘటన జరిగింది.
అది కూడా ఎవరూ కనీసం ఊహించని ఘటన చోటుచేసుకుంది. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ఆరంభించి.. ఎమ్మెల్యేలుగా గెలుపొంది.. తదనంతర కాలంలో టీడీపీని, దాని అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్ ను తీవ్ర వ్యక్తిగత పదజాలంతో దూషించిన వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ కాన్ఫరెన్స్‌లో ప్రతక్ష్యమయ్యారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. వీరి రాకపై విద్యార్దులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. స్క్రీన్ పై వారిద్దరి విజువల్స్ కనిపించడంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. జూమ్ లైవ్‌ను నిర్వాహకులు కట్ చేశారు.
వైసీపీ వాళ్లున్నా ఫర్వాలేదు..
అయితే, జూమ్ కాల్ లో వైసీసీ నేతలు ప్రత్యక్షం కావడాన్ని నారా లోకేశ్ స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఆ పార్టీ నేతలు ఉన్నా ఫర్వాలేదని, ప్రభుత్వం తీరు ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వం చేతగానితనమని మండిపడ్డారు. జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తిక్ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగడతానంటూ లోకేశ్ ఆ సమావేశాన్ని కొనసాగించారు.
విద్యార్థినుల లింక్ తో.. వారి ఆఫీసుల నుంచే లాగిన్...
లోకేశ్ విద్యార్థులతో నిర్వహిస్తున్న జూమ్ కాల్ కు వైసీపీ నేతలు హాజరు ఎలా సాధ్యమైందనేది ప్రశ్నగా మిగిలింది. పదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినుల ఐడీల లింక్‌తో వీరు చొరబడినట్లు తెలుస్తోంది. నవ్య తోట పేరుతో వంశీ, కార్తీక్ కృష్ణ పేరుతో కొడాలి నాని లాగిన్ అయినట్లు టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ వారి ఆఫీసుల్లో నుంచే ల్యాప్‌టాప్‌లతో లాగిన్ అయ్యారు. ఇద్దరూ కూడా లైవ్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకులు వెంటనే లైవ్ కట్ చేశారు. మరోవైపు.. వైసీపీ నేత దేవేందర్ రెడ్డి కూడా జూమ్‌లో ప్రత్యక్షమయ్యారు.
లోకేష్‌తో మాట్లాడేందుకు దేవందర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వంశీ, కొడాలి నానిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇలా విద్యార్థినుల పేర్లతో ఎందుకు రావాల్సి వచ్చింది..?. దమ్ముంటే నేరుగా చర్చకు రావాలి' అని ఆ ఇద్దరికీ లోకేష్ సవాల్ విసిరారు. ఈ ఘటన అనంతరం వంశీ, నాని ఇద్దరూ జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఫొటోలను లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ సమాధానం చెప్పండి..!'అసలు రెండు లక్షల మంది ఎందుకు తప్పారు..? దీనికి జగన్ సమాధానం చెప్పాల్సిందే.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులకు సీఎం ఏమని సమాధానం చెబుతారు..?. ఇప్పుడైనా తీరు మార్చుకుని జగన్ సమీక్ష చేయాలి. పరీక్షల ప్యాటర్న్ మార్చమని మిమ్మల్ని ఎవరు అడిగారు..?.
ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' అని సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ నిలదీశారు. విజనరీ బాబు.. ప్రిజనరీ జగన్..!కాగా అంతకుముందు.. విజనరీ చంద్రబాబు, ప్రిజనరీ జగన్‌కు మధ్య ఉన్న తేడానే పదో తరగతి ఫలితాలని లోకేష్ వ్యాఖ్యానించారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షల నిర్వహణ, ఉత్తీర్ణతపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని వెంటనే ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన ఆరోపించారు. మరోవైపు... మరణించిన విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాలని.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని లోకేష్ అభయమిచ్చారు.