కొడాలి నాని వర్సెస్ యలమంచిలి శ్రీనివాస్

Update: 2016-12-31 08:45 GMT
గుడివాడలో ఫిరాయింపుల పర్వం వివాదాలకు దారితీస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన మున్సిపల్  ఛైర్మన్ యలమంచిలి శ్రీనివాసరావును వైసీపీ నేతలు అడ్డుకోవడంతో గొడవ ముదిరింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. రెండు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
     
గుడివాడ మున్సిపాలిటీ సమావేశం రచ్చరచ్చగా మారింది. వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన చైర్మన్ యలమంచలి శ్రీనివాస్‌ రావు సభలోకి రాగానే రగడ మొదలైంది. శ్రీనివాస్‌ ను ఎమ్మెల్యే కొడాలి నాని - వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ముందు వైసీపీకి రాజీనామా చేసి… అప్పుడు టీడీపీ కండువా కప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. శ్రీనివాస్‌ రావు తన సీటులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
    
దీంతో టీడీపీ కౌన్సిలర్లు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కౌల్సిలర్లు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కంట్రోల్ చేశారు.   కొద్ది నెలల కిందటే వైసీపీకి చెందిన 9మంది కౌల్సిలర్లతో కలిసి శ్రీనివాస్‌రావు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.  చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి కొడాలి నాని ఆగ్రహంగా ఉన్నారు.  తాజాగా మున్సిపల్ సమావేశం జరగడంతో రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News