తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తేల్చేశారు. తాము మహాకూటమితోనే ముందుకు సాగుతామని తేల్చిచెప్పారు. తెలంగాణలో నిరంకుశంగా పాలిస్తున్న టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగానే మహాకూటమితో ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు.
మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై ఈరోజు కోదండరాం - టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ - సీపీఐ ప్రధాన కార్యదర్శి చాడా వెంకట రెడ్డి - కాంగ్రెస్ నేతలు బుధవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల ఆమోద ముద్ర కోసం ఢిల్లీ వెళ్లడంతో వీరు తాజాగా సమావేశమయ్యారు.
అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటుతో రాష్ట్రంలో మార్పు వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఈ కూటమి ఏర్పాటులో అన్ని పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని.. తాము కూడా కాంగ్రెస్ తోనే కలిసి సాగుతామని పేర్కొన్నారు.
అయితే తాము సీట్ల కోసం కాంగ్రెస్ ను వీడి బీజేపీతో జతకడుతున్నామన్న ప్రచారం అబద్ధమని.. కూటమితోనే సాగుతామని స్పష్టం చేశారు. ఇక కూటమి ఏర్పాటు ఆలస్యం కావడం.. అభ్యర్థులను లేట్ గా ప్రకటించడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని కోదండరాం చెప్పుకొచ్చారు. అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో టీఆర్ఎస్ కు ధీటుగా ప్రచారం చేయలేకపోతున్నామన్నది వాస్తవమే అని కోదండం రాం అంగీకరించారు.