కోదండ‌రాం -కాంగ్రెస్ పొత్తుకు ఛాస్సుందా?

Update: 2018-05-11 10:00 GMT
తెలంగాణ‌... విప్ల‌వ గ‌డ్డ‌. ఏ పాల‌కుడు అయినా రానీ, ఎలా అయినా పాలించ‌నీ... చిన్న అన్యాయం జ‌రిగినా కూడా గొంతులు లేస్తాయి ఇక్క‌డ‌. అందుకే కేసీఆర్ లాంటి స్ట్రిక్ట్ పొలిటీషియ‌న్ కూడా నిరంత‌రం రైతులు, నీళ్లు, ఉద్యోగాల గురించి అహ‌రహం శ్ర‌మించాల్సి వ‌స్తుంది. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విభ‌జ‌న గొడ‌వ‌లు ఉన్నా కేవ‌లం ఆ క‌ల తెలంగాణ‌కే సాకారం అయ్యిందంటే.. అదిక్క‌డి ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తే.

తెలంగాణ అధికారంలోకి వచ్చాక ఉద్య‌మ పార్టీని రాజ‌కీయ పార్టీగా ప్ర‌క‌టించుకున్న కేసీఆర్ కొంద‌రిని ప‌క్క‌న పెట్టారు. వారిలో కీల‌క‌మైన వ్య‌క్తి జేఏసీ ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన కోదండ‌రాం. ఆయ‌న ఒక‌ప్పుడు సాధార‌ణ ప్రొఫెస‌రే కావ‌చ్చు. కానీ ఇపుడు తెలంగాణ‌లో కేసీఆర్ తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికీ కోదండ‌రాం కూడా తెలుసు. అంత పాపులారిటీ ఉందాయ‌న‌కు. అందుకే చేతిలో డ‌బ్బులేక‌పోయినా ఆయ‌న పార్టీని ఒక థ్రెట్‌లా భావిస్తోంది టీఆర్ఎస్ పార్టీ.

ఇటీవ‌ల‌ తెలంగాణ జ‌న‌స‌మితి పేరిట పార్టీ స్థాపించిన కోదండ‌రాం జ‌నంలో ఉదృతంగా తిరుగుతూ ఉన్నారు. ఆయ‌న పెడుతున్న స‌భ‌ల‌కు కూడా స్పంద‌న బానే ఉంటుంది. బేసిగ్గా ప్రొఫెస‌ర్ కావ‌డంతో గ‌వ‌ర్న‌మెంటును లాజిక్‌తో, నెంబ‌ర్ల‌తో కొడుతున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కోదండ‌రాంపై ఓ క‌న్నేసి ఉంచింది. కోదండ‌రాం ఓ శ‌క్తి. కానీ ఆ శ‌క్తికి డ‌బ్బు అండ లేదు. కాబ‌ట్టి ఆ బ‌ల‌హీన‌త‌ను వాడుకుందాం అని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ కోదండ‌రాం అంత సులువుగా వారి ప్ర‌తిపాద‌న అంగీక‌రించే మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌క్తి కాదు. పైగా కాంగ్రెస్ కూడా సీట్ల కేటాయింపులో లిబ‌ర‌ల్ గా ఉండే అవ‌కాశ‌మే లేదు. ఎన్ని సీట్లు వ‌చ్చినా -రాక‌పోయినా కోదండ‌రాంకు పోయేదేం లేదు కాబ‌ట్టి కాంగ్రెస్‌కు ఆయ‌న అవ‌స‌రం ఉంది గానీ, ఆయ‌న‌కు కాంగ్రెస్ అవ‌స‌రం లేదు. కాబట్టి క‌చ్చితంగా కోదండ‌రాం త‌న వాద‌నే  నెగ్గాల‌నుకుంటాడు.

కోదండ‌రాం ఒక 30-40 సీట్లు అడుగుతాడేమో అని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. కానీ పార్టీ మాత్రం నాలుగైదు ఎమ్మెల్యే సీట్ల‌కు మించి ఇవ్వ‌దు అంటున్నారు. అలాంటి ప‌రిస్థితే వ‌స్తే అస‌లు పొత్తే వ‌ద్దంటాడు కోదండ‌రాం. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ వెన‌క్కు త‌గ్గ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే గ్రామీణ తెలంగాణ‌లో కోదండ‌రాంకు ఉన్న ఆద‌ర‌ణ అలాంటిది. మ‌రి ఇది ఎక్క‌డిదాకా వెళ్తుందో కాల‌మే నిర్ణ‌యించాలి.
Tags:    

Similar News