చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందించటం.. చిన్నా.. పెద్దా తేడా లేకుండా అందరికి ఒకేలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చేస్తున్న వైనం ఈ మధ్యన తరచూ కనిపిస్తోంది.అటు అసెంబ్లీ సమావేశాల్లోనే కాదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసనలు.. ఆందోళనలు.. ఏదైనా సరే.. ఒకే సూత్రం.. ఒకటే పద్ధతి అన్నట్లుగా కనిపిస్తోంది.
మొన్నామధ్యన మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. నిరసన వ్యక్తం చేస్తున్న కమలనాథులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు వెనుకాడలేదు. ప్రశ్నోత్తరాల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించటం ద్వారా.. సస్పెన్షన్ అవుదామనే సభకు వచ్చినట్లుగా బీజేపీ నేతల వైఖరి ఉందన్న మంత్రి హరీశ్ రావు.. మరో మాటకు తావు ఇవ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేల్ని రెండు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యేల విషయంలోనే కాదు.. ఉద్యమ నేతల విషయంలోనూ.. వారి నిరసన ప్రదర్శనల విషయంలోనూ అలాంటి కఠిన నిర్ణయాల్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వ అధికారుల తీరు చూస్తుంటే స్పష్టమవుతుందని చెప్పాలి. నగరం నడిబొడ్డున ఉన్న ధర్నాచౌక్ ను ఇందిరాపార్కు పక్క నుంచి నగరశివారుకు తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ధర్నా చౌక్ తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన మందిరం నుంచి 2కే రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన టీజేఏసీ నేత కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనను నిర్వహించేందుకు సైతం పోలీసులు నో చెప్పటం.. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఎంతమాత్రం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2కే రన్ ను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మొహరించటం.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న నేతల్ని అడ్డుకొని అదుపులోకి తీసుకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/