తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఎలా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన 'సామాజిక గుండె చప్పుడు' - 'ఆటా-పాటా-మాటా' కార్యక్రమంలో కోదండరాం ప్రసంగించారు. "అభివృద్ధి అంటే సీమాంధ్రలో జరిగింది కాదు. పాత అభివృద్ధి నమూనా పోవాలి. తెలంగాణలో అభివృద్ధి అంటే ప్రజలు మరింత మెరుగైన జీవితం గడపాలి. వ్యవసాయం లాభసాటి చేయాలి. వృత్తుల్ని ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. త్యాగాలు చేసిన విద్యార్థులకు ఉన్నత చదువులు ఉచితంగానే అందాలి. అన్ని కులాల వారికీ అన్ని అవకాశాలూ లభించాలి. అందుకు ప్రజాస్వామ్య సూత్రానికి సామాజిక న్యాయం జోడించాలి'" అని ఆయన సూచించారు. జీవో 123 అమలు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్తూ ఈ జీవో ఏ కోర్టులోనూ నిలవదని కోదండరాం జోస్యం చెప్పారు.
సీమాంధ్రలో జరిగిన కాంట్రాక్టర్లు - రియల్టర్ల అభివృద్ధి నమూనాయే తెలంగాణ రాష్ట్రంలోనూ జరుగుతోందని కోదండరాం తప్పుపట్టారు. అలాంటి అభివృద్ధి కోసం రాష్ట్రం సాధించుకోలేదని చెప్పారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో సకల జనులు అభివృద్ధి చెందాలని, అందరికీ అన్ని రకాల అవకాశాలు లభించాలని కోదండరాం ఆకాంక్షించారు. ఇప్పటి వరకూ తెలంగాణ కోసం పోరాడామని ఇక నుంచి ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడుతామని అన్నారు. జీవో 123 సరికాదనే విషయాన్ని జేఏసీ ఎప్పటి నుంచో ప్రభుత్వానికి చెబుతూ వచ్చిందని కోదండరాం అన్నారు. భూసేకరణలో నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరితే అభివృద్ధి వ్యతిరేకులంటూ ప్రభుత్వం ముద్ర వేసిందన్నారు. అభివృద్ధికి భూసేకరణ అనివార్యంగా చేయాల్సి వస్తే సర్వస్వం కోల్పోయే నిర్వాసితులకు అంత కంటే మెరుగైన పరిహారం ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. తొందరగా భూసేకరణ చేయడం అంటే నిర్వాసితుల్ని పూర్తిగా నష్టపర్చడమే అవుతుందన్నారు. అందుకే పార్లమెంట్ లో 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చారన్నారు. దాంట్లోనూ కొన్ని లోపాలున్నా గతంలో ఎన్నడూ లేని మెరుగైన చట్టంగా ఉందన్నారు. ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం దానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో జీవో 123 జారీ చేసిందని చెప్పారు. 2013 చట్టం కంటే మెరుగైన పరిహారం ఇచ్చేందుకు మాత్రమే కొత్త చట్టం చేయాలని ఉందని, ఆ ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఎలాంటి చట్టం తెచ్చినా అది న్యాయబద్ధమైందని కాదని అన్నారు. జీవో 123 ఏ కోర్టులోనూ చెల్లదని జోస్యం చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/