ఫెడరల్ ఫ్రంట్ పై కోదండరాం తేల్చేశాడు..

Update: 2019-05-11 05:13 GMT
మే 23 దగ్గర్లోనే ఉంది. కేసీఆర్ మళ్లీ మొదలెట్టాడు. దక్షిణాది పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట కలిసివచ్చే పార్టీలకు గాలం వేస్తున్నారు.మరి ఈ ఫ్రంట్ ఎన్నికల తర్వాత క్రియాశీలం అవుతుందా.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్మాయంగా దేశంలో నిలబడే సత్తా ఉందా.? అసలు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కూటమి మూడో ప్రత్యామ్మాయ కూటమిగా నిలబడుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

దీనిపై సీనియర్ నేత దత్తాత్రేయ, జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పేశారు. అది ఒక కలగానే మిగిలిపోతుందని కుండబద్దలు కొట్టారు. తాజాగా ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్రమాజీ మంత్రి దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక అవకాశవాది అని.. ఆయనను ఎవరూ నమ్మరని.. అందుకే ఫెడరల్ ఫ్రంట్ లో ఎవరూ చేరరని.. ఫ్రంట్ నిలబడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దేశంలో మూడో ఫ్రంట్ చాలా సార్లు ఫెయిల్ అయ్యిందని.. కేసీఆర్ పార్టీ నేతలను కలిసినంత మాత్రనా కేసీఆర్ అందరూ వస్తారనుకుంటే అది భ్రమే అని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ కూటమి, మరొకటి కాంగ్రెస్ కూటమి అని.. ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక జాతీయ పార్టీలో చేరడమే తప్పితే మిగతా ఆప్షన్ లేదని దత్తాత్రేయ కుండబద్దలు కొట్టారు..

ఇక కోదండరాం కూడా ఫెడరల్ ఫ్రంట్ పై తన అభిప్రాయన్ని వివరించారు.దేశంలో పార్టీలు కలిసి కాంగ్రెస్ తో కలిసి మహాకూమిగా ఏర్పడ్డాయని కోదండరాం చెప్పుకొచ్చారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కూటమే అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ ప్రాతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఒక అత్యాశ అని స్పష్టం చేశారు. ఈ రాజకీయ పర్యటనలు అన్ని ఒక నాటకం అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రభావం ఉండదని.. ఒకవేళ ఏర్పడినా టీఆర్ ఎస్, వైసీపీ తప్పితే వేరే పార్టీ ఉండదన్నారు. అది కేవలం తెలుగు ఫ్రంట్ గానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ టైం వేస్త్ చేసుకుంటున్నాడని తెలిపారు.

ఇలా ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలను బట్టి దేశంలో మూడో ఫ్రంట్ మనుగడ సాధ్యం కాదని చెబుతున్నారు. ఒకటి కేసీఆర్ వైఖరి , రెండోది మూడో ఫ్రంట్ మనుగడ కష్టమని దేశంలో ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. డీఎంకే కూడా కాంగ్రెస్ తో కలవనది అందుకేనని అర్థమవుతోంది. అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
    

Tags:    

Similar News