తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా.. ఆయన పాలన మీద కనీస స్థాయిలో విమర్శలు కూడా రాకుండా సాగుతున్న వేళ.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ కాకుండా ప్రజాసమస్యల మీద దృష్టి సారిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని విపక్షాలన్నీ చేష్టలుడిగినట్లుగా ఉండిపోయి.. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు.. విమర్శలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వేళ.. కోదండరాం కేసీఆర్ సర్కారు మీద ఘాటైన విమర్శలు చేయటం గమనార్హం.
తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ‘‘రెండేళ్ల తెలంగాణ – ప్రజా ఆకాంక్షలు – ప్రభుత్వ తీరు తెన్నులు’’ అనే అంశం మీద ఓ సదస్సును నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కోదండరాం తెలంగాణ ప్రభుత్వం మీద సునిశిత విమర్శలు చేయటం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి కాంట్రాక్టు.. రియల్ ఎస్టేట్.. కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పని చేస్తే ప్రయోజనం ఉండదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసిన కోదండరాం.. కేవలం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ మిగిలిన జిల్లాల్ని విస్మరిస్తే ప్రజలు ఆమోదించే స్థితిలో లేదరన్నారు.
వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. అందుకే తాము కోర్టునుఆశ్రయించినట్లుగా చెప్పిన కోదండరాం.. పాలీహౌస్ వంటి వాటి వల్ల పేద రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉందన్నారు. కుల వృత్తులు ఏ శాఖ కిందకు వస్తాయన్న విషయంపై కనీస అవగాహన లేదంటూ ప్రభుత్వ తీరుపై చురకలు అంటించే ప్రయత్నం చేశారు. తాటి చెట్టు ఏ శాఖ కిందకు వస్తాయో కూడా తెలీదంటూ ఎద్దేవా చేస్తూ.. ఈ మధ్యనే చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి ప్రస్తావించారు.
ఇటీవల ఒక గీత కార్మికుడు తాటి చెట్టు మీద నుంచి కింద పడి మరణించాడని.. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం తమది కాదంటే తమది కాదంటూ హార్టికల్చర్.. ఎక్సైజ్ శాఖలు తప్పించుకోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యను ఉచితంగా అందించాలని.. ప్రజల రోగాలకు సరైన వైద్యం చేయిస్తే.. తెలంగాణలో మూడో వంతు ఆత్మహత్యల్ని ఆరికట్టొచ్చన్న కోదండరాం.. తెలంగాణను అభివృద్ధి చేయటం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకుంటే మేం చేసి చూపిస్తామంటూ సౌండ్ పెంచారు.
తమకు దురాశ.. పేరాశ లేదని.. ప్రజలు బాగుండాలన్నదే తమ లక్ష్యమని అందుకే నిలబడ్డామని.. లేకుండా తమ సంస్థను పార్టీలో కలిపేసి వాళ్ల వెనుక నడిచేవాళ్లమంటూ తెలంగాణ అధికారపక్షంపై నేరుగా విమర్శలు సంధించటం గమనార్హం. మొదట్లో సంయమనంతో వ్యవహరించినట్లుగా కనిపించి.. ఈ మధ్యనే విమర్శల గళాన్ని విప్పుతున్న కోదండరాం.. తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. సరికొత్త రాజకీయ వేదిక ఒకటి తెలంగాణలో ఆవిష్కృతం కానుందా? అన్న సందేహం కలగకమానదు.