ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షాన్ని ఓడించేందుకు వీలుగా కీలక విపక్షాలు ఏకం కావటం తెలిసిందే. కాంగ్రెస్ తో కలిసి జత కట్టేందుకు టీడీపీ.. తెలంగాణ జనసమితి.. సీపీఐలు ఒక కూటమిగా మారి కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.
పొత్తుకు సంబంధించిన ప్రాధమిక చర్చలు జరిగినట్లుగా చెబుతూ.. కలిసి పోటీ చేయాలన్న అంశంపై ఒక క్లారిటీకి వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. మరి.. సీట్ల విషయంలో పార్టీల మధ్య చర్చల కసరత్తు ఒక పట్టాన తేలని రీతిగా మారాయి. ఎవరికి వారు వీలైనన్ని ఎక్కువ సీట్లు తమకు కేటాయించాలన్న మాటను కాంగ్రెస్ ముందు పెడుతున్నట్లు చెబుతున్నారు.
మొదట్లో 30 వరకూ సీట్లు అడిగిన టీడీపీ.. ఇప్పుడు తగ్గి పాతిక.. కాదంటే ఇరవైకి వచ్చేందుకు సైతం రెఢీ అంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక.. సీపీఐ పది సీట్లు అడుగుతున్నా.. ఐదు సీట్ల వరకూ తగ్గే వీలుందని చెబుతున్నారు. ఇక.. కోదండం మాష్టారి నేతృత్వంలో తెలంగాణ జనసమితి మాత్రం ఏకంగా పాతిక స్థానాల వరకూ అడుగుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తొలుత పెద్ద సంఖ్యలో సీట్లు అడిగిన తెలుగుదేశం తగ్గి పదిహేను వరకూ రాగా.. కోదండం మాష్టారి పార్టీ మాత్రం ఎంతకూ తగ్గట్లేదని తెలుస్తోంది. తెలంగాణలో నాలుగైదు జిల్లాలు తప్పించి.. మరెక్కడా ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా లేదు. టీఆర్ ఎస్ కు బలమైన పోటీ ఇచ్చే నేతలు లేరు. కానీ.. ఆశ మాత్రం భారీగా ఉండటం ఆసక్తికరంగా మారింది. మహా అయితే ఐదు స్థానాలకు మించి కోదండం మాష్టారికి ఇచ్చే అవకాశం లేదన్న వేళ.. ఆయన మాత్రం అందుకు భిన్నంగా పాతిక సీట్లు ఇవ్వాల్సిందేనని చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి.. కోదండం మాష్టారు కోరుకున్నట్లే జరుగుతుందా? లేదంటే.. కాంగ్రెస్ కోరుకున్నట్లుగా రాజీ ఫార్ములాలో సీట్ల లెక్క ఒక కొలిక్కి వస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. పాతిక సీట్లు కావాలంటూ కోదండం మాష్టారు పెట్టిన బేరం కూటమిలోని పార్టీల్లో ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా తెలుస్తోంది.