టీజేఎస్ నేత కోదండరాం పోటీపై ఇంకా సందిగ్ధత వీడలేదు. అసలు ఎక్కడ పోటీ చేస్తే సులువుగా గట్టెక్కుతారో తీవ్రంగా శోధిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆయన అనుకున్న చోట మిత్ర పక్షాలు బలంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న కోదండరాం - రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కూడా తన వృత్తిలోకి వెళ్లిపోతున్నట్లు కనిపించినా - అడపాదడపా రాజకీయ వ్యవహారాల్లోకి వస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారంటూ విభేదించి టీజీఎస్ స్థాపించారు. మహా కూటమితో జట్టు కట్టారు.
చిన్న పార్టీ అయినా - మహా కూటమిలో తామే కీలకమని అంటున్న కోదండరాం అసలు ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మూడు నియోజకవర్గాల వైపు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అవి వరంగల్ వెస్ట్ - జనగామ - మంచిర్యాల.
వరంగల్ వెస్ట్ లో విద్యావంతులు - ఉద్యోగులు ఎక్కువ. దాంతో ఆయన పోటీ సులువుగా మారుతుందని భావిస్తున్నారట టీజేఎస్ నేతలు. ఇక్కడ నుంచి టీఆర్ ఎస్ తరుపున తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు నాయిని రాజేందర్ రెడ్డి టిక్కెట్ అడుగుతున్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ పోటీ చేసేందుకు క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నానని - తనకు టిక్కెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారట. ఒక వేళ ఈ సీటు కాంగ్రెస్ కు వదిలేస్తే కోదండరాం సంగతి ఏంటనే చర్చ జరుగుతుంది.
ఇక, జనగామలో టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారు. ఈయనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.. ఇక్కడ నుంచి పోటీ చేస్తే కోదండరాం గెలుపు నల్లేరుపై నడకే నని అంచనా వేస్తున్నారు. కాగా, ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన లీడర్ పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఆయనను కాదని టిక్కెట్ కేటాయిస్తారా అని ఆలోచిస్తున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు నిండిన వారిని పక్కన పెట్టాలని భావిస్తుందట. అలా చూస్తే లక్ష్మయ్యకు టిక్కెట్ దక్కక పోవచ్చు. అలాంటప్పడు కోదండరాం పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని అంచనా వేస్తున్నారు.
టీజీఎస్ చూస్తున్న మరో నియోజకవర్గం మంచిర్యాల. కోదండరాం సొంత ఊరు ఆదిలాబాద్ జిల్లా నెన్నెల. ఇది మంచిర్యాలకు దగ్గర. మంచిర్యాలలో పోటీ చేస్తే స్థానికుడున్న సెంటిమెంట్ కలిసొస్తుందని భావిస్తున్నారు. అలాగే, సింగరేణి కార్మికులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి పోటీ చేస్తే విజయం సులువుగా వరిస్తుందని భావిస్తున్నారు. కోదండరాం పోటీపై నెలకొన్న సస్పెన్స్ మరికొద్ది రోజుల్లో వీడనుంది.