కొద్దిరోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై యుద్ధభేరి మోగిస్తున్న జేఏసీ ఛైర్మన్ కోదండరాం మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ప్రచ్ఛన్న పంచ్ లు వేశారు. కాంట్రాక్టర్లకు లబ్ధి కూర్చే తెలంగాణను జయశంకర్ కోరుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని టీజేఏసీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంతో జేఏసీ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రియల్టర్లు - కాంట్రాక్టర్లకు లబ్ధి కూర్చే తెలంగాణను జయశంకర్ కోరుకోలేదంటూ ప్రభుత్వ విధానాలపై విమర్శలు కురిపించారు. తెలంగాణ అభివృద్ధి అందరికీ అందాలన్నదే జయశంకర్ ఆలోచన అని ఆయన అన్నారు. జయశంకర్ లేని లోటు సమాజంలో తీర్చలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలపై స్పష్టమైన నివేదికతో స్పందిస్తామని కోదండరాం తెలిపారు.
కాగా కొద్దిరోజుల కిందట ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు చేసి మంత్రులు - టీఆరెస్ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న కోదండరాం మళ్లీ కొద్దిరోజులగా కామ్ గానే ఉంటున్నారు. దీంతో కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి కోదండరాంపై విమర్శలు చేయొద్దని తన మంత్రులు - నేతలను ఆదేశించారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం ఆగింది. తాజాగా కోదండరాం మళ్లీ జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈసారి టీఆరెస్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మునుపటిలాగానే మళ్లీ విరుచుకుపడతారా? లేదంటే కేసీఆర్ సూచనలు పాటించి సైలెంటుగా ఉంటారా అన్నది చూడాలి.
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే తెలంగాణను జయశంకర్ కోరుకోలేదన్న వ్యాఖ్యలతో కోదండరాం తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటారు. తెలంగాణ ప్రభుత్వం తనను పక్కన పెట్టడమే కాకుండా జయశంకర్ సార్ ఆశయాలను కూడా తుంగలో తొక్కుతోందన్న మెసేజ్ పాస్ చేసినట్లయింది. సందు దొరికితే చాలు జయశంకర్ నామస్మరణ చేసే కేసీఆర్, ఆయన అనుంగులు అంతా కేవలం అవి మాటలకే తప్ప చేతల్లో చూపడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.