కోదండం సార్ కోపం క‌రెక్టేనా?

Update: 2015-08-06 09:49 GMT
ఉద్య‌మ నాయ‌కుడు కోదండం రాం మాష్టారికి కోపం వ‌చ్చింది. అది కూడా కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడి మీద. విష‌యాన్ని ఒక కోణంలో మాత్ర‌మే చూడ‌టం.. రెండో కోణం నుంచి ఏ మాత్రం చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని వైఖ‌రిని మ‌రోసారి మాష్టారు వ్య‌క్తం చేశార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌త కొద్దిరోజులుగా తెలంగాణ అధికార‌ప‌క్షం మీద చుర‌క‌లు వేస్తున్న ఆయ‌న‌.. తెలంగాణ సెంటిమెంట్ ను ట‌చ్ చేసే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌టం లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ తెలంగాణ అధికార‌ప‌క్షంపై కొద్దిపాటి విమ‌ర్శ‌లు చేస్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌ను ల‌క్ష్యంగా చేసుకొని వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా.. లోక్ స‌భ‌లో తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు అంశంపై టీఆర్ ఎస్‌.. అధికార బీజేపీ మ‌ధ్య  వాద‌న జ‌ర‌గ‌టం..ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ ఎంపీలు కేంద్రం మీద విమ‌ర్శ‌లు చేయ‌టం.. దానికి కేంద్ర‌మంత్రి వెంక‌య్య ఘాటుగా స‌మాధానం ఇవ్వ‌టం తెలిసిందే.

కేంద్రం అధికారంలోకి వ‌చ్చి ప‌ద్నాలుగు నెల‌లు అవుతున్నా.. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విష‌యంలో ఎందుకు నిర్ణ‌యం తీసుకోవ‌టం లేద‌ని చెప్ప‌టంతో పాటు.. హైకోర్టును ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అడ్డుకోవ‌టం ద్వారా తెలంగాణ మీద పెత్త‌నం చేయాల‌ని చూస్తున్నారంటూ విమ‌ర్శ‌లు చేయ‌టం తెలిసిందే.

దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన వెంక‌య్య స‌మాధానం ఇచ్చే స‌మ‌యంలో.. ఆయ‌న్ను మాట్లాడ‌నీయ‌కుండా టీఆర్ ఎస్ ఎంపీలు అడ్డుప‌డ‌టంతో అగ్ర‌హం చెందిన వెంక‌య్య‌.. మీ ఇష్టం..ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. కేంద్ర‌మంత్రి త‌న ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకుంటారు. అప్పుడేం చేసుకుంటారో చేసుకోండంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌లు కోదండం మాష్టారికి కోపం వ‌చ్చేశాయి. హైకోర్టు విభ‌జ‌న‌పై ఏం చేస్తారో చేసుకోండని అన‌టం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు బాధ్య‌తారాహిత్యంతో మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు.

ఒక‌వేళ కోదండం మాష్టారి మాటల్లో నిజం ఉంద‌నే అనుకుంటే.. టీఆర్ ఎస్ ఎంపీలు ఇష్టారాజ్యంగా ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రైన చ‌ర్యా?  కేంద్ర‌మంత్రి స‌మాధానం చెబుతుంటే ఆయ‌నను మాట్లాడ‌నీయ‌కుండా అడ్డుప‌డ‌టం స‌రైన‌దేనా? ఒక‌రి త‌ప్పుల్ని ఎంచే స‌మ‌యంలో ఇరు వ‌ర్గాల వైఖ‌రిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని విమ‌ర్శ‌లు చేయ‌టంలో అర్థం ఉంటుంది. తెలంగాణ అధికార‌ప‌క్షం నేత‌ల ఆరోప‌ణ‌లు తీసుకుంటే.. కేంద్రం ఏర్ప‌డిన ప‌ద్నాలుగు నెల‌ల్లో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని? తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేస్తే.. ఏపీ సంగ‌తేంటి? విభ‌జ‌న స‌మ‌యంలో ఇలాంటి హ‌డావుడి నిర్ణ‌యాల‌తో ఇప్పుడు రెండు రాష్ట్రాలు కొట్టుకునే ప‌రిస్థితి. అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా.. ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో ప్ర‌క్రియ‌ను తీసుకెళ్ల‌టం మంచిది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంతో పోలిస్తే.. తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు విష‌యంలో కేంద్ర‌మంత్రులు చాలా స్ప‌ష్టంగా స‌మాధానం ఇస్తున్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా..స‌భ‌లో లేని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న తీసుకురావ‌టంలో అర్థం ఏమిటి? ఏపీ ముఖ్య‌మంత్రి అడ్డు ప‌డితేనే హైకోర్టు రాకుండా ఆగిపోయే అంత సీన్ ఉంటే.. ముందు త‌న రాష్ట్రానికి కావాల్సిన‌వి చేయించుకోగ‌లిగేవారు క‌దా?

త‌న‌ది తానే ఏడ‌వ‌లేక‌.. కిందా మీదా ప‌డుతున్న చంద్ర‌బాబు.. కేంద్రాన్ని.. న్యాయ‌శాఖ‌ను ప్ర‌భావితం చేసి.. తెలంగాణ మీద పెత్త‌నం సాగించేంత విష‌యం బాబు ద‌గ్గ‌ర ఉందా? ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు ఎదుటివారిని ఎంత‌గా బాధ పెడ‌తాయి? అలాంటి వాటి గురించి మాట్లాడ‌ని కోదండం మాష్టారు.. వెంక‌య్య అన్న మాట‌లే ఎందుకు వినిపిస్తాయో..?
Tags:    

Similar News