కేసీఆర్‌ కి చుక్కలు చూపిస్తున్న కోదండరామ్‌

Update: 2016-09-06 13:16 GMT
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ కీలక పాత్ర వహించాడు. రాష్ట్ర సాదన పోరాటం పరంగా ప్రజల్లో కేసీఆర్‌ కు సమానంగా కోదండరాంకు కూడా పేరున్నదని అంతా అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కూడా జేఏసీ ఛైర్మన్‌ గా చురుగ్గానే వుంటున్నారు. అవసరమైన చోట ప్రతిపక్షాలు కన్నా మెరుగ్గా విమర్శిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాడు. కెసీఆర్‌ కూడా ఆయన విమర్శలకు స్పందిచకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. కాని రాను, రాను కోదండరామ్‌ కెసీఆర్‌ కి చుక్కలు చూపించే పరిస్థితి కల్పిస్తున్నారనేది ప్రజల్లో వినిపిస్తున్న అభిప్రాయం. అచ్చంగా గాంధీజయంతి రోజున గాంధీమార్గంలో కోదండరాం ప్రకటిస్తున్న దీక్ష కేసీఆర్‌ సర్కారుకు ఒక హెచ్చరికే.

తెలంగాణ ఏర్పడ్డాక కూడా జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని ప్రభుత్వ దృష్టి కి తీసుకెళుతున్నారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలోని రైతు సమస్యలు తెలుసుకుని ఒక నివేదిక తయారు చేసినట్టు తెలిసింది. కాని ప్రభుత్వం రైతు సమస్యల పై నిర్లక్ష్యం చేస్తుందని కోదండరామ్‌ భావన. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయరంగ దుస్థితి పై పూర్తిగా ఒక రోజు కేటాయించాలని డిమాండ్‌ చేసారు.

అందుకు నిరశనగా అక్టోబర్‌ 2 తేదీన మౌనదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు నూతన వ్యవసాయ విధానం - పంట రుణాలు - అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. ప్రతిజిల్లాలో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకుని త్వరలో ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెచ్చరిస్తున్న కోదండరాం - కెసీఆర్‌ కి చుక్కలు చూపిస్తున్నారనేది జనాభిప్రాయం. అయితే కోదండ రాం ఒక రోజు మౌనదీక్షే కదా అని కేసీఆర్‌ ఉపేక్షించడానికి అవకాశం లేకుండాపోయింది. ఆయన రైతు సమస్యల మీద పోరాటం సుదీర్ఘంగా సాగుతుందని చెబుతున్నారు. మరి జనం దృష్టిలో ప్రభుత్వం పరువు పోకుండా కేసీఆర్‌ సర్కారు కోదండదీక్షకు విరుగుడుగా ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News