ముందస్తు సమరం జోరందుకుంది. అధికార - ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ జట్టు కడుతున్నాయి. ఓ జాతీయ పార్టీని మట్టి కరిపించేందుకు పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీని లేకుండా చేసేందుకు అదే జాతీయ పార్టీతో జత కలుస్తోంది. ఇది భారత రాజకీయమంటే. ఈ కూటమికి తెలంగాణ ప్రజలు మద్దతు పలుకుతారో....లేక వ్యతిరేకిస్తారో తేలాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఈలోగా తెలంగాణలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది.... ఏ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఇంతవరకూ ప్రత్యక్ష రాజకీయాలంటే ఏమిటో తెలియని వారు ఈ సారి ఎన్నికల క్షేత్రంలోకి వస్తున్నారు. వీరు తెలంగాణ ప్రజల మనసు చూరగొంటారా అన్నదే ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీలతోనూ....వివిధ పోరాట రూపాలతోనూ తెలంగాణ ప్రజలకు దగ్గరైన మేథావి - ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జన సమితి పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. మేథావిగా - తెలంగాణ సిద్ధాంత కర్తగా పేరున్న కోదండరాంకు రాజకీయ నాయకుడిగా అంత అనుభవం లేదు. వ్యూహాలు - ప్రతివ్యూహాలు రచించే రాజకీయ చతురత కూడా లేదు. అయినా కోదండరాం ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.దీనికి ఏకైక కారణం ప్రభుత్వంపై... ముఖ్యంగా ప్రభుత్వాధినేత కె.చంద్రశేఖర రావుపైనే ఆయనకు తీవ్ర వ్యతిరేకత. ఇది వచ్చే ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న.
రానున్న ఎన్నికల కోసం తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మహాకూటమిగా ఏర్పాటు అవుతున్నాయి. ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీ నేత్రత్వం వహిస్తోంది. వారి వారి బలాన్ని బట్టి తెలంగాణలో సీట్ల సర్దుబాటు చేయాలన్నది మహా కూటమి ఉద్దేశ్యం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీలు సాధారణంగానే ఎక్కువ స్ధానాలు కోరుకుంటాయి. అయితే నిన్న - మొన్న పుట్టిన కోదండరాం పార్టీ తెలంగాణ జన సమతి కూడా ఈ ఎన్నికల్లో ఏకంగా 30 నుంచి 40 స్ధానాలు కోరుకుంటోంది. ఇన్ని స్ధానాలు తీసుకుందుకు తెలంగాణ జన సమితికి... ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండ రాంకు అంత సీన్ ఉందా అని తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉద్యమాలు వేరు....రాజకీయాలు వేరని - ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నవి రాజకీయాలే కాని ఉద్యమం కాదని వారంటున్నారు. దీనిని అనుసరించే తెలంగాణ జన సమితి ముందస్తు ఎన్నికల్లో తమ పాత్ర ఏ మేరకు ఉంటుందో అంచనా వేసుకుని అందుకు తగినట్లుగా వ్యవహరించాలని వారంటున్నారు.