సిటీ సెంటర్ లో బరిలోకి కోదండరాం.?

Update: 2018-09-20 11:21 GMT
మహాకూటమి లో ఇప్పుడు కోదండరామే కొరకరాని కొయ్యగా మారిపోయాడని వార్తలొస్తున్నాయి. కామన్ మినిమం ప్రోగ్రాం ఏర్పాటు చేసి దానికి తనను చైర్మన్ ను చేయాలని.. అలాగే 30 వరకూ టీజేఎస్ కు సీట్లు కావాలని మొండిపట్టు పడుతున్నాడని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అందుకే కూటమి సీట్లు సర్దుబాటు కొలిక్కి రావడం లేదని చెబుతున్నారు. కోదండ పోటీచేసి స్థానం పేరు చెబితే అభ్యర్థులను సర్దుబాటు చేసుకుందామని కాంగ్రెస్ కోరుతున్నా ఆయన నోరు మెదపడం లేదట..

కాగా కోదండరాం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ పార్టీ తరఫున మంత్రి పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ - టీడీపీలకు సరైన బలం - అభ్యర్థులు లేకపోవడంతో ఈ నియోజకవర్గమే బెస్ట్ అనే ఆలోచనలో కోదండరాం ఉన్నట్టు సమాచారం.

తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో కోదండరాంను ఆదరించవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉండడం.. ఆ యూనివర్సిటీలోనే కోదండరాం ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అలాగే మాణికేవ్వర్ నగర్ - అడ్గటుట్ట ఏరియా ప్రజలతో కోదండకు మంచి పరిచయాలున్నాయి.. అలాగే కోదండ నివాసం కూడా తార్నాకలో ఉండడంతో మరింత కలిసి వచ్చే అంశంగా చూస్తున్నట్టు తెలిసింది. ఇన్ని అవకాశాల నేపథ్యంలోనే ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

అయితే గెలిచాక కోదండను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ కోదండ మాత్రం అసెంబ్లీలోనే గళమెత్తుతానని అంటున్నారట.. సికింద్రాబాద్ లో బలమైన టీఆర్ ఎస్ మంత్రి పద్మారావుకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఇక్కడ కోదండరాం లాంటి వ్యక్తే సరైన వారని ప్రచారం జరుగుతోంది. కోదండ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణ ప్రజల దృష్టి అంతా సికింద్రాబాద్ నియోజకవర్గం పైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News