కోటి రూపాయల పెనాల్టీ కట్టిన కోడెల కుమారుడు!

Update: 2019-10-18 15:46 GMT
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి తండ్రి రాజకీయ ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజ్ చేశారనే పేరు తెచ్చుకున్నారు కోడెల శివరాం. కోడెల ఆత్మహత్యకు ఆయన సంతానమే కారణమని కొంతమంది తెలుగుదేశం నేతలు ఆఫ్ ద రికార్డు వ్యాఖ్యానించి ఆ కుటుంబాన్ని మరింత ఇరకాటంలో పెట్టేశారు.

కోడెల ఆత్మహత్యను ప్రభుత్వంపై అస్త్రంగా వాడదామచి చంద్రబాబు నాయుడు ప్రయత్నించి విఫలం అయ్యారు. కోడెల అప్పటికే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా చంద్రబాబు నాయుడు కనీసం పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయాకా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలని చూడటం వివాదంగా నిలిచింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆ వ్యవహారాన్ని వదిలేశారు.

అయితే కోడెల శివరాం చేసిన అక్రమాలపై విచారణ  మాత్రం సాగుతూ ఉంది. అందులో భాగంగా ఆయన బైకుల రిజిస్ట్రేషన్ వివాదం ఒకదాంట్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాదం పై అధికారులు విచారణ జరిపించారు. రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించకుండా బైకులను అమ్మి.. కోడెల శివరాం ప్రభుత్వానికి కొన్ని పదుల లక్షల రూపాయల నష్టాన్ని చేకూర్చినట్టుగా అధికారులు గుర్తించారు.

సాక్షాలతో సహా ఆ విషయంలో పట్టుబడ్డారు. దీనిపై ఇటీవలే విచారణ జరిపి కోటి రూపాయల మేరకు ఫైన్ విధించారు. తాజాగా ఆ ఫైన్ ను కోడెల శివరాం కట్టినట్టుగా తెలుస్తోంది. కోటి రూపాయల ఫైన్ చెల్లించడం గురించి రిసీట్ వైరల్ అవుతూ ఉంది. బైకుల రిజిస్ట్రేషన్ స్కామ్ కు సంబంధించి ఆయన ఈ ఫైన్ చెల్లించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించే వాళ్లు.. ఇలాంటి విషయాలను గమనించి కొంచెం జాగ్రత్త పడాలని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News