ఐదేళ్ల పాటు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు, కూతురు చేసిన అల్లకల్లోలం అంతా కాదు. చివరకు వీళ్ల ధాటికి తట్టుకోలేక వాళ్ల ఇంటిపేరుతో కే ట్యాక్స్ పేరుతో పేరు పెట్టేశారు. వీళ్ల దెబ్బకు ప్రతిపక్షాలే కాదు చివరకు సొంత పార్టీ నేతలు కూడా తట్టుకోలేక ఆ ట్యాక్స్ కట్టుకున్నారు. మనం ఇంతలా చెప్పుకుంటోంది ఎవరో కాదు... గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేసిన వసూళ్ల పర్వానికి లెక్కేలేదు.
ఇక ఎప్పుడైతే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, ఇటు కోడెల ఓడిపోవడం జరిగిందో వెంటనే ఐదేళ్లుగా కే ట్యాక్స్ దెబ్బకు బెంబేలెత్తిన వారంతా ఇప్పుడు స్వచ్ఛందంగా బయటకు వచ్చి స్టేషన్ మెట్లు ఎక్కి ఫిర్యాదులు చేస్తున్నారు. గత రెండు నెలలుగా కోడెలకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ట్యాక్స్ వసూళ్లపై కేసులు, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదురవ్వడంతో విలవిల్లాడుతోన్న కోడెలకు ఇప్పుడు అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు.
కోడెల కుమారుడు శివరాంకు చెందిన గౌతమ్ హోండా షోరూమ్ ను వారు సీజ్ చేశారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వీరు వాహనాలు విక్రయించినట్టు గర్తించిన అధికారులు గత ఐదేళ్లుగా వీరు ఈ దందా చేసినట్టు గుర్తించారు. కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్ లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. గుంటూరుతో పాటు నరసారావుపేటలోనూ మొత్తం రెండు షోరూమ్ లు సీజ్ చేశారు.
ఈ తనిఖీల్లో హోల్ సేలర్ దగ్గర నుంచి టూ వీలర్ వాహనాల అమ్మకాల వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మినట్టు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. కోడెల కుమారుడు శివరాంపై కేసు నమోదు చేస్తామని కూడా ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటన ట్రాన్స్‌ఫోర్ట్ వ్యవస్థలోనే భారీ కుంభకోణమని కూడా పలువురు చెపుతున్నారు. ఓవరాల్ గా రూ.12 కోట్ల వరకు ట్యాక్స్ కట్టనట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రెండు నెలల్లోనే కోడెల చేసిన కోట్లాది రూపాయల అవినీతి చరిత్ర తవ్వేకొద్ది బయట పడుతూనే ఉంది. దోచుకుంటానికి కాదేది అనర్హం అన్నట్టుగా వీరి దోపిడీ కొనసాగింది. మరి వీరి దోపిడీ చరిత్ర ఇంకెంత ఉందో ? చూడాలి.