వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా.. జగన్ తరఫున తరచూ గళం విప్పే అంబటి రాంబాబు గుర్తున్నారా?తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఇష్యూ గుంటూరు జిల్లాలో రగులుతోంది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణపై అంబటి రాంబాబు.. జగన్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లు ఆరోపణలు చేశారట. తనకు ఏ మాత్రం సంబంధం లేని అంశాల మీద తన ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఆరోపణలు.. విమర్శలు చేయటంపై కోడెల శివరామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనపై అరోఫణలు చేసిన అంబటి..గోపిరెడ్డిలు తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. అందుకు 48 గంటలు మాత్రమే సమయం ఇస్తూ ఒక పత్రికాప్రకటన విడుదల చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఉన్నవారు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలపై ఆరోపణలు.. విమర్శలు సహజమే. అదే సమయంలో తమపై వచ్చే ఆరోపణలు.. విమర్శలపై సీరియస్ కావటం.. వివరణ ఇవ్వటం మామూలే. కానీ.. 48 గంటల టైమిచ్చి ఈ లోపు సారీ చెప్పాలని లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పటం ఆసక్తికరంగా మారింది.
తనకు క్షమాపణలు చెప్పకుంటే అంబటి.. గోపిరెడ్డిలపై సివిల్.. క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లాయర్ చేత ప్రకటన ఇప్పించిన క్రమంలో.. జగన్ పార్టీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఉత్కంటగా మారింది. ఓపక్క తమపై విమర్శలు.. ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెడతానని.. జైల్లో తోయిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. అలా అభ్యంతరం వ్యక్తం చేసిన వారిలో తెలంగాణ తెలుగుదేశం నేతలూ ఉండటాన్ని మర్చిపోకూడదు. ఒకచోట తప్పు పట్టిన అంశం.. మరోచోట తామే ఆ పని చేయటాన్ని తెలుగుదేశం నేతలు ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి. పవర్ చేతిలో ఉంటే.. ఆరోపణలు.. విమర్శలు సహించలేరా?