చిన్నారి క‌ష్టాల వీడియోకు కోహ్లీ ఏం చేశారంటే..

Update: 2017-08-20 09:31 GMT
స్టార్ క్రికెటర్ అయిన‌ప్ప‌టికీ సామాజిక అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌నలోని ఆత్మీయ‌త‌ను చాటుకున్నాడు. కేవ‌లం కోహ్లీయే కాకుండా స‌హ‌చ‌ర ఆటగాళ్లైన శిఖ‌ర్ దావ‌న్‌ - యువరాజ్ సింగ్‌ - రాబిన్ ఊత‌ప్ప సైతం సోషల్‌ మీడియాలో వైర‌ల్ అయిన ఓ చిన్నారి ఆవేద‌న‌పై ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో ట్వీట్ చేశారు. ఇంత‌కీ ఈ క్రికెటర్ల‌ను అలా క‌లవ‌ర‌పాటుకు గురిచేసిన అంశం ఏమిటంటే....ఓ చిన్నారిని వాళ్ల‌మ్మ కొట్ట‌డం. ఎందుకు అంటే...చ‌దువుకోవడం లేద‌నే కార‌ణంతో.

ఓ చిన్నారి త‌న త‌ల్లి కోపం చేస్తున్న కార‌ణంగా ఏడుస్తున్న దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. త‌న పుస్త‌కంలోని 1-5 అంకెల‌ను చ‌దువుతున్న క్ర‌మంలో ఆ చిన్నారి త‌ప్పుగా ప‌లుకుతుంది. దీంతో త‌ల్లి కోపం చేస్తూ స‌రిగ్గా చ‌ద‌వాల‌ని ప‌దేప‌దే చెప్తుంటి. అయిన‌ప్ప‌టికీ ఆమె స‌రిగ్గా చ‌ద‌వ‌క‌పోవ‌డంతో  పాప త‌ల్లి ఆమెను కొడుతుంది. ఇది స్థూలంగా వీడియో. ఇది వైర‌ల్ అవ‌డం, మ‌న క్రికెట‌ర్ల దృష్టికి రావ‌డం జ‌రిగింది. దీంతో స్టార్ క్రికెట‌ర్లు స్పందించారు.

త‌మ వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ చిన్నారుల‌ను మ‌నం ప్రేమించాల‌ని మ‌న క్రికెట‌ర్లు కోరారు. ``పిల్ల‌ల ప‌ట్ల తల్లిదండ్రులు ప్రేమాభిమానాల‌తో పాటుగా ఓర్పుతో ఉండాలి. ప్రతి చిన్నారికి సొంతంగా నేర్చుకునే గుణం ఉంటుంది. దాన్ని  గౌర‌విద్దాం. ఓర్పుగా నేర్పుదాం. ద‌య‌చేసి వారిని కొట్ట‌కండి. కోపం కూడా చేయకండి`` అంటూ ఈ స్టార్ క్రికెట‌ర్లు త‌ల్లిదండ్రుల‌ను కోరారు.
Tags:    

Similar News