తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కాకుంటే.. తాను చేసింది తప్పు అని చెంపలేసుకోవటం.. తనను క్షమించాలని కోరటాన్ని సరేననుకోవచ్చు. అది కూడా తీవ్రమైన నేరం కాకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ.. పాకిస్థాన్ లో కోహ్లీ వీరాభిమాని చేసిన పనికి అతని వెంట ఎవరూ నిలబడని పరిస్థితి. తెలియక చేసిన పనికి నెల రోజులపైనే జైల్లో ఉన్న అతగాడికి ఎట్టకేలకు బెయిల్ లభించింది.
జనవరి 25న టీమిండియా.. ఆస్ట్రేలియాల మధ్య తొలి ట్వంటీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ చెలరేగిపోయి 90 పరుగులు చేయటంతో టీమిండియా విజయం సాధించింది. తన అభిమాన క్రికెటర్ చెలరేగిపోయి ఆడటంతో మ్యాచ్ గెలిచిందన్న సంతోషంతో.. కోహ్లీ మీదున్న అభిమానంతో ఇండియా జెండాను పాకిస్థాన్ కు చెందిన ఉమెర్ డరాజ్ తన ఇంటి మీద భారతీయ జెండాను ఎగరువేశాడు. అలా ఎగరేయటం చట్టప్రకారం పెద్ద నేరమన్న విషయం అతగాడి తెలీదు.
తన ఇంటి మీద ఇండియా జెండా ఎగురువేయటంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మొత్తం విషయం తెలిసిన అతగాడు బోరుమని.. తనకే పాపం తెలీదని.. ఇలాంటివన్నీ అవగాహన లేకుండా తాను జెండా ఎగురవేశానని.. తనను దయచేసి క్షమించాలని కోర్టును అడిగినా ససేమిరా అంటూ జైలుశిక్ష విధించారు. దాదాపు నెల రోజులకు పైనే పోరాడిన అతగాడికి ఎట్టకేలకు బెయిల్ లభించింది.
ఇంటి మీద ఇండియా జెండా ఎగురవేసిన దానికి జనవరి 25న అరెస్ట్ అయిన అతడు తాజాగా జైలు నుంచి విడుదలయ్యాడు. జెండా ఎగురవేయటం తప్పు అని తెలియక తాను ఆ పని చేసినట్లుగా వివరణ ఇచ్చుకున్నారు. చేసిన తప్పుపై అన్నిసార్లు వివరణ ఇస్తే కానీ.. బెయిల్ దక్కని పరిస్థితి. మరోవైపు జేఎన్ యూలో ఎలాంటి ఆరాచకం జరుగుతుందో వీడియో ఫుటేజ్ మొదలు.. అధికారపక్షం సాక్ష్యాలు చూపిస్తున్నప్పటికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడటం కనిపిస్తుంది. మరోవైపు.. తెలియన తప్పు చేశానని పాక్ లోని కోహ్లీ వీరాభిమాని కిందామీదా కొట్టుకున్నా.. అతడికి మద్దుతుగా ఒక్కరంటే ఒక్క రాజకీయ నాయకుడు కానీ.. పార్టీ కానీ గళం విప్పింది లేదు. పాకిస్థాన్ లో పరిస్థితి అలా.. భారత్ లో పరిస్థితి ఎలా ఉందో దేశ ప్రజలందరూ చూస్తున్నదే. రెండు దేశాల మద్య వ్యత్యాసమే కాదు.. ప్రజలు.. రాజకీయ నాయకుల మైండ్ సెట్ కూడా ఎలా ఉందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా కోహ్లీ వీరాభిమాని ప్రస్తుతానికి సుదీర్ఘ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నాడు. అంతిమంగా అతనికి ఎలాంటి శిక్ష పడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.