కోహ్లీ అన్నంతనే దూకుడుగా.. ప్రత్యర్థి బౌలర్లు వేసే బంతుల్ని కఠినంగా శిక్షించటమే కాదు.. తన విధ్వంసకర బ్యాటింగ్ తో చేసే రచ్చ ఎంతన్నది తెలిసిందే. అలాంటి కోహ్లికి కోపం కూడా చాలా ఎక్కువ. ఆ మాటకు వస్తే.. ఆ కోపం.. ఆ దూకుడు మిగిలిన ఆటగాళ్ల నుంచి కోహ్లీని వేరుగా ఉంచాయి. ఆట వేళలో అతగాడి ఆవేశాన్ని కూడా ఆయన అభిమానులు విపరీతంగా ఆరాధించటమే కాదు.. అంతకు మించి ప్రేమిస్తారు కూడా.
తాజాగా అతడి ఆవేశం మరోసారి చర్చకు వచ్చింది. తాజాగా జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న వేళ.. ఔట్ అయిన కోహ్లీ తన ఆగ్రహాన్ని గోడ మీద చూపించారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ 44 పరుగుల వద్ద ఓటయ్యారు. మొయిన్ అలీ బౌలింగ్ లో సింఫుల్ క్యాచ్ ఇవ్వటం ద్వారా పెవిలియన్ బాట పడ్డారు. అతను చేసిన 44 పరుగ్లో ఏడు ఫోర్లు (28 పరుగులు ఉత్త ఫోర్లు కొట్టటం ద్వారానే వచ్చాయన్న మాట) ఉండటం గమనార్హం.
బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ.. మంచి ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టినట్లుగా అందరూ భావిస్తున్న వేళ.. అనూహ్యంగా ఔట్ కావటం.. కోహ్లీని తీవ్రమైన నిరాశకు.. అంతకు మించిన ఆగ్రహానికి గురి చేసిందన్న విషయం.. తాజాగా బయటకు వచ్చిన వైరల్ వీడియో వెల్లడించింది. చూడచక్కని బ్యాటింగ్ తో దూసుకెళుతున్న వేళ.. మాంచి ఇన్నింగ్స్ చేస్తానన్న కాన్ఫిడెన్సులో ఉన్నారేమో కానీ.. ఔట్ అయిన వెంటనే ఆయన తన వేదనను ప్రదర్శించారు.
పెవిలియన్ నుంచి డ్రెస్సింగ్ రూంలోకి వెళుతూ.. గ్లోవ్స్ తోనే గోడను బలంగా కొట్టిన సీన్ ఒకటి వైరల్ అవుతోంది. గడిచిన రెండేళ్లుగా కోహ్లీ సెంచరీ సాధించలేదు. యాభై పరుగులు దాటిస్తున్నా.. వందకు మాత్రం చేరుకోలేకపోతున్నాడు. ఇది అతనిలో ఆగ్రహాన్ని పెంచుతుందన్న మాట వినిపిస్తోంది. తాజా ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించలేకపోయానన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదే విషయం ఆయన ముఖంలోనే కాదు.. చేతల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ చిట్టి వీడియో వైరల్ గా మారింది.

Virat Kohli is frustrated of his dismissal.#ENGvIND pic.twitter.com/YifSoc9UEe
— Mr.Cricket (@MrCricketR) September 5, 2021