భారత్ లో క్రికెట్ అనేది మతంగా మారి చాలా సంవత్సరాలైపోయింది. క్రికెట్ ను ఇష్టపడే వారంతా కూడా ఈ మతానికి సచిన్ ను దేవుడిని చేసేశారు. దీంతో క్రికెట్ గాడ్ ఎవరంటే అంతా కూడా సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతుంటారు. క్రికెట్ హిస్టరీ సచిన్ టెండూల్కర్ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందనడంలో ఎవరికీ సందేహం లేదు.
సచిన్ తర్వాత టీం ఇండియాలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సచిన్ కాలంలోనే టీం ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్.. స్టైలిష్ బ్యాట్స్ మెన్ లక్ష్మణ్.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ గా సెహ్వాగ్ రాణించారు. వారంతా తమ క్రికెట్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఆ తర్వాతి కాలంలో ఎం ఎస్ ధోని భారత కెప్టెన్ అయ్యాడు. ఇతడి కెప్టెన్సీలో భారత్ వన్డే.. టీ20 ప్రపంచకప్ లు.. ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ నెంబర్ వన్ ర్యాంక్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ధోని సారథ్యంలోనే విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు స్టార్ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.
విరాట్ కోహ్లీ కెప్టెన్ గానూ బ్యాట్స్ మెన్ గానూ రాణించాడు. అయితే కొన్ని ముఖ్య సిరీసులో టీం ఇండియా జట్టు తలబడటంతో అతనిని బీసీసీఐ కెప్టెన్సీ నుంచి తప్పించింది. కోహ్లీ టీంలో వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం టీం ఇండియా సారథిగా కొనసాగుతున్నాడు. 2022 వరల్డ్ కప్ టీ20 సిరీస్ రోహిత్ శర్మ సారథ్యంలో టీం ఇండియా ఆడింది. అయితే సెమిస్ లోనే భారత్ తిరుగుముఖం పట్టింది.
ఇదిలా ఉంటే తమ అభిమాన క్రికెటర్ల గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తూ నెట్టింట్ట వారి గురించి సెర్చ్ చేస్తుంటారు. ఈక్రమంలోనే ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షణలు పొందిన క్రికెటర్ల జాబితా వికీపీడియా తాజాగా రిలీజు చేసింది. ఈ జాబితాలోనూ కింగ్ కోహ్లీనే నెంబర్ వన్ నిలిచి సత్తా చాటాడు.
వికీపీడియా ప్రకటించిన జాబితా మేరకు వివరాలిలా ఉన్నాయి. 2015-22 మధ్య కాలంలో టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కోసం 39 మిలియన్ల మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 22 మిలియన్ల వీక్షణలతో సచిన్ రెండో ప్లేసులో ఉండగా.. ఎంఎస్ ధోని 21 మిలియన్లతో.. రోహిత్ శర్మ 11 మిలియన్ల వీక్షణలు పొందినట్లు వికీపీడియా వెల్లడించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.