కోహ్లీకి న‌చ్చ‌లేదంటూ గుడ్ బై చెప్పేశాడు

Update: 2017-06-21 07:03 GMT
ప‌దిహేడేళ్ల‌కు పైగా అంర్జాతీయ క్రికెట్ తో అనుబంధం.. వివాదాల‌కుదూరంగా ఉంటార‌న్న పేరు.. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిలుస్తార‌న్న మాట‌.. అనిల్  కుంబ్లే సొంతం. టీమిండియా క్రికెట్ జ‌ట్ట‌కు ప్ర‌ధాన కోచ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. తాజాగా త‌న ప‌ద‌వికి రాజీనామా చెప్పేసి.. బాధ్య‌త‌ల‌కు గుడ్ బై చెప్పేశారు. టీమిండియాకు ఏడాది నుంచి కోచ్ గా ఉన్న కుంబ్లే.. కెప్టెన్ కోహ్లీతో ఉన్న విభేదాల నేప‌థ్యంలో త‌న కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం సంచ‌న‌లంగా మారింది. వెనువెంట‌నే కాదు కానీ.. క‌నీసం వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న వ‌ర‌కైనా కోచ్ ప‌ద‌విలో కొన‌సాగాల‌ని కోరినా ఆయ‌న స‌సేమిరా అన్నారు.

ఏడాది క్రితం టీమిండియాకు ప్ర‌ధాన కోచ్ గా ఎంపిక చేసిన వేళ‌.. ఆయ‌న దీర్ఘ‌కాలం పాటు ఈ ప‌ద‌విలో ఉంటార‌ని అంద‌రూ భావించారు. అయితే.. అందుకు భిన్నంగా కెప్టెన్ కోహ్లీకి కుంబ్లే తీరు న‌చ్చ‌క‌పోవ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెర‌గ‌టంతో పాటు.. త‌న మ‌న‌స్త‌త్వానికి భిన్న‌మైన ప‌రిస్థితుల్ని తాను అంగీక‌రించ‌లేన‌న్న విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేసి మ‌రీ వెళ్లిపోయారు.

టీమిండియాకు ఏడాది పాటు కోచ్ గా ఉన్న కాలంలో కుంబ్లే జ‌ట్టును న‌డిపించిన తీరుకు స‌గ‌టు అభిమాని నుంచి బీసీసీఐ వ‌ర‌కూ అంద‌రూ హ్యాపీగా ఉన్నారు. అయితే.. త‌న కోచింగ్ స్టైల్ మీద కెప్టెన్‌ కు అభ్యంత‌రాలు ఉండ‌టంతో తాను కోచ్ ప‌ద‌విలో కొన‌సాగ‌లేనంటూ ట్విట్ట‌ర్లో ట్వీట్ ద్వారా చెప్పేశారు.

కోచ్ ప‌ద‌వికి తాను ఎందుకు గుడ్ బై చెప్పిన విష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో వివ‌రంగా వెల్ల‌డించాడు కుంబ్లే. కోచ్ గా త‌న‌పై బీసీసీఐ స‌ల‌హా క‌మిటీ విశ్వాసం ఉంచ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాన‌ని చెప్పిన కుంబ్లే.. ఏడాదిగా టీమిండియా సాధించిన విజ‌యాల ఘ‌న‌త‌ను అంద‌రి ఖాతాలో వేశారు కుంబ్లే. కెప్టెన్‌.. జ‌ట్టు మొత్తానికి.. కోచింగ్ బృందానికి టీమిండియా విజ‌యాల ఘ‌న‌త ద‌క్కుతుంద‌న్న ఆయ‌న‌.. వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు కోచ్ గా ఉండాల‌ని త‌న‌ను అడిగార‌ని కానీ తాను నో చెప్పిన‌ట్లుగా చెప్పేశారు.

"వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు కోచ్ గా కొన‌సాగ‌మ‌ని క్రికెట్ స‌ల‌హా సంఘం న‌న్ను కోరింది. అయితే.. ప్ర‌ధాన కోచ్ గా కొన‌సాగ‌టంపై.. నా కోచింగ్ శైలిపై కెప్టెన్‌ కు అభ్యంత‌రాలు ఉన్న‌ట్లుగా బీసీసీఐ నిన్న‌నే (సోమ‌వారం)  తెలిపింది. ఆ విష‌యం తెలిసి ఆశ్చ‌ర్య‌పోయా. నేనెప్పుడు కోచ్ గా నా ప‌రిధిని దాట‌లేదు. మా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విభేదాలు ప‌రిష్క‌రించేందుకు బీసీసీఐ ప్ర‌య‌త్నించింది. అయితే.. ఈ బంధం కొన‌సాగ‌టం స‌రికాద‌న్న‌ది స్ప‌ష్టం. అందుకే నేను వెళ్లిపోవ‌టం స‌రైన‌ది" అంటూ త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశారు కుంబ్లే.

క్ర‌మ‌శిక్ష‌ణ‌.. అంకిత‌భావం..నిజాయితీ.. భిన్న ఆలోచ‌న‌లు.. ఇలాంటివి జ‌ట్టులోకి తీసుకొచ్చానని.. ఒక బంధం ప్ర‌భావంతంగా ఉండాలంటే ఇలాంటి వాటికి విలువ ఇవ్వ‌టం చాలా ముఖ్య‌మ‌ని కుంబ్లే పేర్కొన్నారు. ఏడాదిగా టీమిండియాకు సేవ‌లు అందించే అవ‌కాశం ద‌క్క‌టం త‌న‌కు ల‌భించిన గౌర‌వంగా చెప్పిన కుంబ్లే.. భార‌త్‌ కు ఎప్పుడూ మ‌ద్ద‌తుగా నిలిచే వారికి థ్యాంక్స్ చెప్పారు. భార‌త క్రికెట్‌ కు తానెప్పుడు శ్రేయోభిలాషిగా ఉంటాన‌ని వ్యాఖ్యానించారు. త‌న నిష్క్ర‌మ‌ణ‌కు కోహ్లీకి ఉన్న అభ్యంత‌రాలే అన్న మాట‌ను కుంబ్లే ఓపెన్ గా చెప్పేసి గుడ్ బై చెప్పేసిన తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News