షమీ భూతుల వ్యవహారం పై స్పందించిన కోహ్లీ ..ఏమన్నాడంటే?

Update: 2021-10-30 13:35 GMT
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా తన మొదటి మ్యాచ్ లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. ఇక రెండో మ్యాచ్ న్యూజిలాండ్‌ తో మ్యాచ్‌ కు ముందు సోషల్ మీడియాలో మహ్మద్ షమీ గురించి అడిగిన ప్రశ్నలకు విరాట్ కోహ్లీ సమాధానమిచ్చాడు. పాకిస్థాన్‌ పై ఓటమి తర్వాత, మహ్మద్ షమీని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లుగా ఆట ఆడడమే మా పని. బయట నుంచి వచ్చే మాటలు పట్టించుకోం. మా దృష్టి పూర్తిగా మ్యాచ్‌ పైనే ఉంటుందని కోహ్లీ తెలిపాడు.

సోషల్ మీడియాలో కొందరు తమ గుర్తింపును దాచిపెట్టి ఇలాంటి పనులు చేస్తుంటారని, ఈ రోజుల్లో ఇలాంటివి సర్వసాధారణంగా మరిపోయాయని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇలాంటి వాతావరణం వల్ల డ్రెస్సింగ్ రూమ్ దెబ్బతినకూడదు. బయట ఎలాంటి డ్రామాలు నడిచినా పట్టించుకోం. తరువాత మ్యాచ్‌ పైనే మా ఫోకస్ ఉంటుందని తెలిపాడు. మతం ఆధారంగా ఏ వ్యక్తిని టార్గెట్ చేయరాదని విరాట్ కోహ్లీ స్పష్టంగా తెలిపాడు. అలా చేయడం తప్పు. నేనెప్పుడూ ఎవరితోనూ ఇలా ప్రవర్తించలేదు. అయితే ఇది కొందరి మూర్ఖుల పని అని అన్నాడు.

మహ్మద్ షమీ టీమ్ ఇండియాలో ముఖ్యమైన భాగం. భారత్ తరఫున ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. ఇప్పటికీ, అతని ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ట్రోల్స్ చేసే వారి కోసం మా సమయాన్ని వృధా చేసుకోవాలని కూడా అనుకోను. షమీకి మద్దతుగా 200 శాతం నిలబడతాం అని చెప్పాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి మాట్లాడాడు. హార్దిక్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, ఆరో బౌలర్ అవసరమైతే సిద్ధంగా ఉంటాడని విరాట్ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News