సచిన్, ధోనీలను మించిపోయిన కోహ్లీ

Update: 2017-02-21 08:17 GMT
టీమిండియా మాజీ దిగ్గజాల రికార్డులను కొల్లగొడుతూ సంచలనం సృష్టిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వేటలోనే కాదు భారీ ప్రకటన ఒప్పందాలు చేసుకోవడంలోనూ దిగ్గజ క్రికెటర్లను మించిపోయాడు. ఇంతవరకు ఇండియన్ క్రికెట్లో  సచిన్, ధోనీలే టాప్ బ్రాండ్లుగా ఉన్నారు. భారీ అడ్వర్టయిజ్ మెంట్లు కాంట్రాక్టులంటే వారివే.. కానీ. తాజాగా కోహ్లీ చేసుకున్న ఒప్పందంతో వారిద్దరినీ మించిపోయాడు.  తాజాగా ఆయన జర్మన్ లైఫ్ స్టైల్ బ్రాండ్ పూమాతో బిగ్ డీల్ కు ఓకే చెప్పాడు.  ఇంత పెద్ద ఒప్పందాన్ని గతంలో ఏ భారతీయ క్రీడాకారుడు ఈ సంస్థతో చేసుకోకపోవడం విశేషం. ఈ ఒప్పందం కింద ఎనిమిదేళ్ల కాలానికి 110 కోట్ల రూపాయలను పూమా కోహ్లీకి అందజేయనుంది. దీంతో కోహ్లీ ఆ బ్రాండ్ కు గ్లోబల్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు.
    
పూమా లోగా చిరుత.. అందుకు తగ్గట్లుగానే చిరుతల్లాంటి వరల్డ్ టాప్ స్ర్పింటర్ ఉసేన్ బోల్ట్, అమెరికా పరుగుల వీరుడు స్ప్రింటర్ అసాఫా పావెల్, దిగ్గజ ఫుట్‌ బాల్ క్రీడాకారులు థీర్రి హెన్రీ, అలివర్ గిరౌడ్‌ లను ఇంతవరకు తమ  గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. తాజాగా కోహ్లీతో డీల్ చేసుకుంది. క్రికెట్ లో కోహ్లీ కూడా చిరుతలాంటివాడే కావడంతో ఆయన్ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.
    
కాగా తమ తమ క్రీడల్లో దిగ్గజాలైన వారితో బ్రాండింగ్ పొందడం గర్వంగా ఉందని కోహ్లీ సంబరపడుతున్నాడు.  2013లో 10 కోట్ల రూపాయలకు కోహ్లీ అడిడాస్ తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ముగియడంతో ఇప్పుడ వచ్చే ఎనిమిదేళ్ల కాలానికి పూమాతో ప్రయాణానికి రెడీ అయిపోయాడు. ఎనిమిదేళ్లంటే దాదాపుగా తన కెరీర్ మొత్తం ఈ కాంట్రాక్టు ఉంటుందన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News