రైతు ఉద్యమం... కోహ్లీ ఎవరిపక్షం అంటే..!

Update: 2021-02-04 13:18 GMT
రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీల నుంచి ఇటీవల మద్దతు లభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా సీరియస్​గా స్పందించింది. మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరంటూ విదేశాంగశాఖ హెచ్చరించింది. 
అయితే ఇప్పటికే మనదేశానికి చెందిన కొందరు సెలబ్రిటీలు.. విదేశీ సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మా దేశ వ్యవహారల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరంటూ వాళ్లు ప్రశ్నించారు.

 సచిన్​ టెండుల్కర్​, అక్షయ్​, కంగనారనౌత్​ తదితరులు కేంద్రానికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్​ కూడా రైతు ఉద్యమంపై స్పందించారు. 
'రైతు ఉద్యమంపై భిన్నాభిప్రాయాలు ఉన్న మాట నిజమే. కానీ రైతులు దేశంలో అంతర్భాగం. 
వారి సమస్యకు కచ్చితంగా పరిష్కారం వస్తుందని నేను ఆశిస్తున్నారు. దేశంలో శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయని నేను ఆశిస్తున్నా’ అంటూ కోహ్లీ ట్వీట్​ చేశారు. 
#IndiaTogether అనే హాష్ టాగ్ విరాట్​ జత చేశాడు. 
ఈ ట్వీట్​ నెట్టింట్లో వైరల్​గా మారింది.


రైతుల ఆందోళన పట్ల అమెరికా పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. 
దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మా దేశ వ్యవహారాల్లో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నరని పలువురు ప్రశ్నించారు. అంతేకాక దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనే శక్తి తమ ప్రభుత్వానికి ఉందని వాళ్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీం ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. అయితే కోహ్లీ ట్వీట్​పై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.
Tags:    

Similar News