కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..గత కొన్ని రోజులుగా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. యావత్ ప్రపంచంలోని ప్రతి దేశం కూడా కరోనాతో పోరాడుతుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది ..అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ కరోనా కి మందు లేక పోవడంతో వ్యాధిని ఎలా కట్టడి చేయాలా అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యం లోనే చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. అయినా కూడా కొంతమంది ఇంకా బయట తిరుగుతున్నారు.
ఈ క్రమంలోనే కరోనావైరస్ పై అవగాహన కల్పించడానికి పోలీసులు.. వైరస్ ఆకారం లో ఉన్న హెల్మెట్లను ధరించి ప్రజలకు అవగాహన కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలో ఉన్న ఓ స్వీట్ షాప్ యజమాని కరోనా వైరస్ ఆకారంలో ఉన్న స్వీట్స్ - కేక్ లను తయారుచేసాడు. దీనితో ఆ దుకాణంలోకి వచ్చే కస్టమర్లు కరోనా స్వీట్ లను చూసి ఆశ్చర్యపోతున్నారు. అదేంటి కరోనా పై పోరులో లాక్ డౌన్ విధించారు కదా ..స్వీట్ షాప్స్ ఎలా ఉన్నాయి అని అనుకుంటున్నారా .. బెంగాల్ ప్రభుత్వం మిఠాయి షాపులకు లాక్ డౌన్ నుండి మినాయింపు ఇచ్చింది.
మిఠాయి దుకాణాలను ప్రతీరోజు నాలుగు గంటలపాటు తెరిచి ఉంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దుకాణాలు తెరచుకోవచ్చు. కానీ, ఆ దుకాణాలలో సిబ్బంది సంఖ్య మాత్రం పరిమితంగా ఉండేలా చూసుకోవడం తో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పుడు ఈ కరోనా స్వీట్ ఫోటోలు - కేక్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కాగా , ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. ఇప్పటి వరకు 74,697 మందిని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 13,46,566 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 2,78, 695 మంది కరోనా నుంచి కోలుకున్నారు.