ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిన్నమొన్నటి వరకు కూడా చాలా దూకుడుగానే వ్యవహరించింది. ఆ కారణంగానే ఎర్రచందనం స్మగ్లింగు చాలావరకు తగ్గింది. అయితే... ఈ వ్యవహారం వెనుక ఉన్న పెద్దల విషయానికొచ్చేసరి మాత్రం చర్యలు నెమ్మదించేస్తున్నాయి. ఒక మాజీ మంత్రిని అరెస్టు చేస్తారని... నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలనూ బయటకు లాగుతారని... బడాబాబులు, అధికారుల గుట్టు విప్పుతామని హడావుడి చేసినా చివరకు చైనా స్మగ్లర్లు.. చెన్నై స్మగ్లర్లను తప్ప ఎవరినీ పట్టుకోవడం లేదు.
కూలీల కోసం కూంబింగ్... స్మగ్లర్ల కోసం స్పెషల్ ఆపరేషన్లు తప్ప తెర వెనుక ఉండి నడిపించే పెద్దోళ్ల సంగతి మాత్రం బయటపెట్టడం లేదు. ఎర్రచందనం దందాలో ఉన్న పెద్దలంతా అధికార పక్షంతో రాజీమార్గానికి వస్తుండడంతో వారి గురించి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. మరోవైపు మారిషస్ లో ఉన్న గంగిరెడ్డిని తేవడం కూడా ఏపీ అధికారులు, పోలీసుల వల్ల కావడం లేదు. మారిషస్ కోర్టుకు ఇప్పటికే సమచారం ఇచ్చిన ఇక్కడి పోలీసులు కోర్టు వాయిదాలకు వెల్లేవారు. ఇప్పుడు దానికి కూడా వెళ్లడం లేదని సమాచారం.
కాగా గంగిరెడ్డి కేసును ఒక్కసారిగి వదిలేయడంతో ఈ కేసుపై రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఉన్న పెద్దలు అధికార పక్షంతో కాళ్లబేరమే... రాజీమార్గమో చేసుకోవడంతోనే చూసీచూడనట్లుగా వదిలేశారని తెలుస్తోంది. ఇంతపెద్ద ఎత్తున హడావుడి చేసి లక్షల కోట్ల సంపద అక్రమంగా తరలిపోకుండా కట్టడి చేయగలిగిన సీఎం చంద్రబాబు దానికి కారకులను కూడా కోర్టుకీడ్చితే అందరిలోనూ భయం వస్తుంది... లేకుంటే మెల్లమెల్లగా మళ్లీ పాత పరిస్థితులే వచ్చేస్తాయి. శేషాచలం అడవుల్లో గొడ్డలి చప్పుళ్లు పెరిగిపోతాయి.