పన్నీర్ పై నటీనటుల ప్రశంసల జల్లు

Update: 2017-02-08 13:18 GMT
ఫలితం ఎలా ఉంటుందో కానీ.. చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్ సెల్వంపై  సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్ ధైర్యాన్ని హీరోలు.. హీరోయిన్లు పొగిడేస్తున్నారు. తొలిసారి ధైర్యంగా మాట్లాడారని.. వెన్నుముక కలిగిననేతగా వ్యవహరించారంటూ పొగిడేస్తున్న వారు.. చిన్నమ్మకు వ్యతిరేకంగా మాట్లాడే విషయంలో అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించారని వారు ట్వీట్లు చేస్తున్నారు.

ఇలా అభినందిస్తున్న వారిలో తమిళ సినీ రంగ ప్రముఖులు కమల్ హాసన్ తో పాటు.. అరవింద్ స్వామి.. సిద్ధార్థ.. ఆర్యలతోపాటు నటీమణులు గౌతమి.. ఖుష్బూ తదితరులు విపరీతంగా పొగిడేస్తున్నారు. పన్నీర్ సెల్వంపై వారు కురిపించిన ప్రశంసల జల్లును చూస్తే..

‘‘తమిళనాడు ప్రజలారా త్వరగా నిద్రపొండి. రేపు వాళ్లు మనకంటే ముందే నిద్రలేస్తారు. శుభరాత్రి’’ అని లోక నాయకుడు కమల్ హాస్ ట్వీట్ చేస్తే.. ‘‘బటానీలు తింటూ వార్తలు చూస్తున్నా. హుప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది. ఇక పాప్ కార్న్ తింటా’’ అని అరవింద స్వామి వ్యాఖ్యానించారు. యువ నటుడు ఆర్య పన్నీర్ ను పొగిడేస్తూ.. ‘‘సరైనసమయంలో ఓపీఎస్ సర్ గొప్పగా.. ధైర్యంగా మాట్లాడారు. ఆయనకు నా హ్యాట్సాప్’’ అని చెప్పగా.. మరోనటుడు సిద్ధార్థ్.. ‘‘మెరీనాలో ఓపీఎస్.. తమిళనాడు రాజకీయాలు హాలీవుడ్ మూవీని తలపిస్తున్నాయి’’ అని ట్వీట్ చేశారు.

ఇక.. సీనియర్ నటి గౌతమి పన్నీర్ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘ఓపీఎస్ ను అందుకే అమ్మ ఎంచుకున్నారు. అంతరాత్మమేరకు నడుచుకునే ధైర్యం ఆయనకు ఉంది. ఇది తమిళనాడుకు.. అమ్మకు న్యాయం చేయటమే’’ అంటూ ట్వీట్ చేయటమే కాదు.. ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోడీకి ట్యాగ్ చేయటం గమనార్హం. ఇక.. సీనియర్ నటి కమ్ రాజకీయ నేత ఖుష్బూ స్పందిస్తూ.. ‘‘మౌనాన్ని వీడి ఓపీఎస్ హీరోగా ముందుకొచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 అంచుల ఛాతీ ఉన్న నేత తరఫున ఆయన పని చేయటం లేదని ఆశిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News