రెండు పిల్లులు కొబ్బరి చిప్ప కోసం కొట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చిన కోతి ఎత్తుకుపోయిన చందంగా ఉందట తెలంగాణ పీసీసీ పదవి. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ల మధ్య పంచాయితీ తీవ్రంగా మారింది. నాకంటే నాకు అని నేతలు కొట్టుకుంటున్నారు. దీంతో కొట్టుకుంటున్న వారిని పక్కనపెట్టి కొత్తవారికి ఇచ్చే ప్రతిపాదన ముందుకొచ్చింది. ఉన్నదీ పాయే.. ఉంచుకున్నదీ పోతుందనే భయంతో కాంగ్రెస్ సీనియర్లు ఓ అవగాహనకు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్..
హుజూర్ నగర్ లో ఘోర ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ పదవి త్యజించడానికి ఉత్తమ్ రెడీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త నేతను ఎన్నుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల హైదరాబాద్ లో సమావేశం కూడా నిర్వహించింది.. తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠం కోసం అధిష్టానం ముగ్గురి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబులలో ఎవరో ఒకరు అవుతారని భావించారు. రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం దృష్టిసారించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీలోని సీనియర్లు అంతా రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం తాత్కాలికంగా ప్రక్రియను వాయిదా వేసింది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నల్గొండ జిల్లాకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు పీసీసీ ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు. దీంతో వీరి మధ్య విభేదాలు పొడచూపాయి..
తాజాగా రేవంత్, కోమటిరెడ్డి ఇద్దరూ అమెరికా పర్యటనకు వెళ్లారట.. అక్కడి రెడ్డి సామాజికవర్గ నేతల సభలో అతిథులంతా వీరికి సంధి చేసినట్టు సమాచారం. ఒకే సామాజికవర్గమైన ఇద్దరూ కొట్టుకోవడం ఏంటని.. పీసీసీ చీఫ్ పదవిని చెరిసగం పంచుకోవాలని సూచించారట.. దీంతో తొలి రెండున్నరేళ్లు కోమటిరెడ్డి, తరువాత రెండున్నరేళ్లు రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని చేపట్టాలని ప్లాన్ చేశారట.. అంతా బాగానే ఉంది.. మరి వీరు పంచుకున్న పీసీసీ పదవిని అసలు కాంగ్రెస్ అధిష్టానం వీరిద్దరికి ఇస్తుందా లేదా అన్నదే అసలు డౌట్ ఇప్పుడు.