తెలంగాణా కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇపుడు మరో కొత్త స్టెప్ వేశారు. ఆయన నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సొనియా గాంధీ ముంగిట నిలుచుకున్నారు. అమ్మ తలుపు తీస్తే తన మనసులో బాధను వ్యధను ఏదైనా ఆమెతో చెప్పుకోవాలనుకుంటున్నారు. అంతే కాదు ఆయన ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడానికే ఢిల్లీ వచ్చారు అని కూడా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన మీద వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న సంగతి విధితమే. అదే టైమ్ లో కాంగ్రెస్ లో రేవంత్ కి సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా కాంగ్రెస్ కి రాజీనామా చేసి మునుగోడుకు ఉప ఎన్నిక తెచ్చారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో అన్న వెంకటరెడ్డి గరం గరం గా ఉన్నారు. తమ్ముడితో పాటుగా తనను కూడా కలుపుకుని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో విమర్శలు చేస్తున్నారు అన్నది ఆయన ఆరోపణ. అయితే వెంకటరెడ్డి వ్యవహారశైలి అనుమానంగా ఉండడంతోనే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అనుచరులు ఇతర నాయకులు ఆయన మీద విమర్శలు చేయాల్సి వస్తోంది అని అంటున్నారు. అయితే ఈ రచ్చ అలా సాగుతోంది.
ఈ నేపధ్యంలో నేరుగా సోనియాగాంధీ సమక్షంలోనే తేల్చుకుందామని భావించే వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్ళారని అంటున్నారు. మరి సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు. మరి రేవంత్ రెడ్డి మీద కోమటిరెడ్డి చేసే ఆరోపణలను సోనియా గాంధీ పట్టించుకుంటారా. రేవంత్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా. ఆయనను కాస్తా తగ్గమని చెబుతారా అంటే అది కూడా ఆలోచించాలి.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలు నియమించిన నాయకుడు. ఆయన కేసీయార్ మీద దూకుడు చేస్తారు. అందుకే ఆయనను సెలెక్ట్ చేస్తారు. ఆయనను నియంత్రిస్తే కచ్చితంగా కాంగ్రెస్ తన అవకాశాలను ఆ మేరకు తగ్గించుకున్నట్లే. అయితే వెంకటరెడ్డి సోనియా గాంధీతో నేరుగా మాట్లాడి అధినాయకత్వం మనసు ఏంటో తెలుసుకున్న మీదట తన భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటారు అని కూడా అంటున్నారు.
మరో వైపు చూస్తే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా సోనియాగాంధీ అపాయింట్మెంట్ కఒరారు అని తెలుస్తోంది. ఆయన కూడా రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు. సీనియర్లకు ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం లేదని కూడా మండుతున్నారు. దాంతో ఆయన కూడా పీసీసీ చీఫ్ మీద ఆరోపణలు ఫిర్యాదులు సోనియమ్మ ఎదుట చేస్తారు అని అంటున్నారు.
మొత్తానికి సోనియా గాంధీ ఈ ఇద్దరు నేతలతో మాట్లాడిన దాని బట్టి ఆమె అభిప్రాయం తెలుస్తుంది. అయితే తెలంగాణా కాంగ్రెస్ లో విభేదాలకు చెక్ పెట్టాలని హై కమాండ్ చూస్తున్న వేళ అంతా కలసి పనిచేసుకోవాలనే చెబుతారు తప్ప ఎవరి మీద పెద్దగా యాక్షన్స్ ఉండవని అంటున్నారు. మరి రేవంత్ నాయకత్వాన పనిచేయడం తమకు అసలు ఇష్టమో కాదో సీనియర్లే తేల్చుకోవాలని అంటున్నారు.