జ‌గ్గారెడ్డికి ఫోన్.. కాంగ్రెస్ లో కాక మొద‌లు!

Update: 2019-06-17 05:13 GMT
ఓప‌క్క కేసీఆర్.. మ‌రోప‌క్క బీజేపీ. ఈ రెండు పార్టీల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఎడెనిమిది నెల‌ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దేన‌ని.. గెలిచిన వెంట‌నే ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చోవ‌టానికి అదే ప‌నిగా క‌ర్చీఫ్ ల మీద క‌ర్చీఫ్ లు వేసిన కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ఎవ‌రి దారి వార‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే వెల్ల‌డైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో కాంగ్రెస్ ను  వీడి.. ఎవ‌రి ఎజెండాకు త‌గ్గ‌ట్లుగా వారు ప్లాన్ చేసుకుంటున్నారు.

నిత్య అసంతృప్త నేతలైన‌ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు తాము చేపట్టాల‌న్న త‌హ‌త‌హ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు మొద‌ట్నించి ఉన్న‌దే. వారి కోరిక ప‌ట్ల‌ పార్టీ అధినాయ‌క‌త్వం పాజిటివ్ గా లేని విష‌యం తెలిసిందే. ఇలాంటివేళ‌.. తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీనే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన రాజ‌గోపాల్ వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీని ఇరుకున ప‌డేలా చేసింది.

బీజేపీ అధిక్య‌త‌ను కాంగ్రెస్ నేత‌లు ఒప్పుకోవ‌ట‌మే కాదు.. పార్టీ మ‌రింత ప‌లుచ‌న అయ్యేలా వ్యాఖ్య‌లు చేయ‌టం ఇబ్బందిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి ఫోన్ చేయ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.ఎన్నిక‌ల్లో గెలుపు అనంత‌రం కేసీఆర్ చెంత‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయిన నేత‌ల్లోనే జగ్గారెడ్డి పేరు కూడా వినిపించింది.

అయితే.. తాను టీఆర్ ఎస్ లోకి వెళ్ల‌న‌ని ఇటీవ‌ల స్ప‌ష్టం చేసిన ఆయ‌న ఇప్పుడు బీజేపీలోకి వెళ్ల‌నున్నారా? అన్న ప్ర‌చారం షురూ అయ్యింది. జ‌గ్గారెడ్డితో రాజ‌గోపాల్ ఏం మాట్లాడారు?   వీరిద్ద‌రి మ‌ధ్య ఫోన్ కాల్ ముచ్చ‌ట బ‌య‌ట‌కు రాలేదు. పార్టీ మీద ఒత్తిడి పెంచేందుకు వీలుగా తాజా ఎత్తుగ‌డ‌ను రాజ‌గోపాల్ ప్ర‌ద‌ర్శిస్తున్నారా?  లేక‌.. బీజేపీలోకి తాను.. మ‌రికొంద‌రు బ‌ల‌మైన నేత‌లు వెళ్లాల‌న్న వ్యూహాన్ని ఆయ‌న అమ‌లు చేస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీనిపై అయితే జ‌గ్గారెడ్డి కానీ.. లేదంటే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ కానీ క్లారిటీ ఇచ్చే వ‌ర‌కూ అస‌లు విష‌యం ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News