తెలంగాణ ఫైర్ బ్రాండ్.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీ మార్పు ఖాయమైంది. త్వరలోనే ఆయన కూడా.. తమ్ముడి బాటలో బీజేపీ గూటికి చేరుకోవడం నిజమేనని తెలుస్తోంది. తాజాగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఆయన జంప్ చేస్తారన్న వార్తలకు బలం చూకూర్చాయి. ఒక టి.. తాను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
రెండు.. వచ్చే ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీనిని బట్టి.. కోమటి రెడ్డి పార్టీ మార్పు ఖాయమని అటున్నారు పరిశీలకులు. కొన్నాళ్లుగా కాంగ్రెస్‌లో తీవ్ర అస మ్మతి వాదిగా ఉన్న వెంకట రెడ్డి ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అనుకూలంగా.. వ్యవహరించారనే టాక్ ఉంది. తన తమ్ముడి కోసం అంటూ.. ఆయన నియోజకవర్గంలో కొందరికి ఫోన్లు చేయడం కలకలం రేపింది.
ఇక, ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిపోవ డం.. కూడా కాంగ్రెస్‌ను తీవ్రస్థాయిలో దెబ్బతీసింది. పార్టీలో ఉంటూనే..ఆ పార్టీ ఇచ్చిన పదవులు అనుభవిస్తూనే పార్టీకి వ్యతిరేకంగా చక్రం తిప్పిన నాయకుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు.
అయినా.. అధిష్టానం కఠిన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే.. ఉన్న కీలక నాయకులు పోతే ఎలా అని అనుకుందో ఏమో!
అయితే.. ఇక, ఇప్పుడు తనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. తాను రాజకీయా లకు దూరంగా ఉన్నానని ప్రకటించారు. అంటే దాదాపు ఆయన కాంగ్రెస్‌తో కటీఫ్ చేసుకున్నానని చెప్పక నే చెప్పారు.
పోనీ.. పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారా? అంటే.. అదీ లేదు. ఎంపీగా కొనసాగుతూ నే.. వచ్చే ఎన్నికలకు ముందు నెలలో తాను ఏ పార్టీలోకి చేరేదీ చెబుతారట. అంటే.. మొత్తంగా ఇప్పటికే తన ఫ్యూచర్ పాలిటిక్స్‌ను నిర్ణయించుకున్నారు. కానీ, ఈ దోబూచులు ఎందుకు? అనేది ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.