ఆ ఒక్క‌డు... ల‌క్ష మందిని ఎలా తెస్త‌డు? .. రేవంత్‌పై కోమటి సైడ్ కామెంట్స్‌!

Update: 2022-04-29 04:53 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ఎంపీ.. ప్ర‌స్తుతం స్టార్ క్యాంపైనైర్‌గా ఇటీవ‌ల నియ‌మితులైన‌.. కోమ టిరెడ్డి వెంక‌టరెడ్డి.. పార్టీ రాష్ట్ర చీఫ్‌.. ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డిపై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు సంధించారు. ఒక‌రు కాంగ్రెస్ నా పార్టీ నా పార్టీ అని ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని.. కానీ, కాంగ్రెస్ మ‌న పార్టీ అని గుర్తించాల‌ని.. హిత‌వు పలికారు. ‘‘నేను అంటే గోవిందా!.. కాంగ్రెస్‌లో నేను అనే పదానికి చోటు లేదు.. మనం అని మాత్రమే అనాలి. కానీ, ఒకాయ‌న మాత్రం నేను.. నేను అంటున్నాడు.. ఏం చేస్తం’’ అన్నారు..

అంతేకాదు.. రేవంత్ సెంట్రిక్‌గా మ‌రో కీల‌క కామెంట్ కూడా చేశారు.. వెంక‌ట‌రెడ్డి.. వ‌చ్చే నెల్లో నిర్వ‌హించ నున్న కాంగ్రెస్ కీల‌క నాయ‌కుడు.. ఎంపీ రాహుల్ సభకు `ఒక వ్యక్తి మాత్రమే లక్షల మందిని ఎలా తీసుకొ స్తా`రని ప్రశ్నించారు. అంద‌రినీ క‌లుపుకొని పోతేనే పార్టీ మెరుగైన ఫ‌లితం ద‌క్కించుకుంటుంద‌న్నారు. ఎక్క‌డిక‌క్క‌డ‌.. పార్టీ బ‌లోపేతం కావాలంటే.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ఒక్క‌రే స‌భ‌లు నిర్వ‌హిస్తామ‌ని.. ఒక్క‌రే జ‌నాల్ని తెస్తామ‌ని.. చెప్ప‌డం వ‌ల్ల ఏమీ జ‌ర‌గ‌ద‌న్నారు.

ఆ పాద‌యాత్రతో అధికారం!

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టి పాదయాత్రపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టమైనా నష్టమైనా పాదయాత్రను కొనసాగించాలని భట్టిని కోరారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలని భట్టికి సూచన చేశారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు భట్టి విక్రమార్కకు అనుమతి ఇవ్వాలని సోనియా, రాహుల్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

2004లో సీఎల్పీ నేతగా రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎంపీ గుర్తు చేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే కావాల్సిన సహకారం సీనియర్లం అందిస్తామన్నారు. ఆయ‌న పాద‌యాత్రతో అధికారం రావొచ్చేమోన‌ని అన్నారు.  

ఉమ్మడి కృషితో వరంగల్‌లో రాహుల్ సభను విజయవంతం చేస్తామని కోమ‌టి రెడ్డి తెలిపారు. బలమైన నల్లగొండలో కాదు.. బలహీనంగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో సన్నాహక సమావేశాలు పెట్టాలని హితవుపలికారు.  3 వేల‌ కోట్లతో మూసీని శుభ్రం చేయలేని అసమర్థ సీఎం‌ కేసీఆర్ అని విమర్శించారు.  ఈయ‌న పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు బంగారు తెలంగాణ రాలేద‌ని.. ఆయ‌న కుటుంబానికి బంగారు బాతును చేసుకున్నాడ‌ని కౌంట‌ర్ ఇచ్చారు.
Tags:    

Similar News