కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. అనూహ్య రీతిలో సస్పెన్షన్ కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్ కుమార్ పోరాటం మలుపులు తిరిగి ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో శుభం కార్డు పడిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ మీద వేసిన పిటిషన్ కొట్టివేషినందుకు సంతోషమన్నారు. ఎమ్మెల్యేలకు రావాల్సిన అన్నింటిని ఇవ్వాలని తీర్పు వచ్చిందని, వెంటనే కోర్ట్ తీర్పును అమలుచేయాలని లేదంటే కోర్ట్ దిక్కరణ చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ప్రకటించారు. న్యాయవ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మొన్న కర్ణాటక ఎన్నికల్లో చూశామన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు ఫోన్ చేసి తీర్పు కంగ్రాట్స్ చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సీఎల్పీ నేత జానారెడ్డి గురించి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. `జానారెడ్డి రేపటి వరకు అలోచించండి.... మమ్మల్ని ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా గుర్తించకుంటే....ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టకుంటే....కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం అయ్యే విధంగా జానారెడ్డి సిద్ధంగా ఉంచాలి. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్ స్పెల్ చేస్తే జానారెడ్డికి ఎలా నిద్ర పడుతుంది? అందరం ఎన్నికలకు పోదాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది` అని కోమటిరెడ్డి అన్నారు.
కాగా, కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్లు మీడియాలో జోరుగా ప్రచారమైన నేపథ్యంలో జానారెడ్డి ఘాటుగా స్పందించారు. రాజీనామా అంశం తనకు తెలియదన్నారు. రాజీనామా విషయం కోమటిరెడ్డి ఎప్పుడు తనతో మాట్లాడలేదని తెలిపారు. ``రాజీనామా విషయాన్నీ పార్టీ లో పెట్టి డిస్కస్ చేస్తాం. రాజీనామా విషయంలో జానారెడ్డి ముందువరుసలో ఉంటాడు. పీసీసీ అధ్యక్షుడితో రాజీనామా విషయాన్నీ మాట్లాడుతాను. ఇదే విషయాన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. పార్టీ నిర్ణయం - అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటే అలాగే ముందుకు వెళతాం...`` అని ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఒక్కరినే కాకుండా అందరిని అణచివేస్తోందని, ఇది హేయమైన చర్య అని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజల్ని కోరుతున్నానని జానారెడ్డి అన్నారు. ముప్పు ఉన్న కోమటిరెడ్డి లాంటి వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జానారెడ్డి అన్నారు. కోమటిరెడ్డికి రక్షణ కల్పించాలని ఐజీకి లేఖ రాశాను.