కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకులుగా ముద్రపడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ ఎస్ పార్టిలో చేరడం. ఇందుకు సంబంధించి వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పదెద్ ఎత్తున ప్రయత్నం చేసిన కోమటిరెడ్డి సోదరులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - రాజగోపాల్ రెడ్డి అది దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతోపాటుగా ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోయే ఎన్నికల వరకు ఆ పదవిలో కొనసాగుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో కలవరం మొదలైందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ వైపు చూసిన ఈ ఇద్దరు నేతలు అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకొని అధికార టీఆర్ ఎస్ గూటికి చేరనున్నారని అంటున్నారు. దీన్ని ఈ ఇద్దరు నేతలు కొట్టిపారేసినప్పటికీ...తాజా అప్ డేట్ తో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో టీఆర్ ఎస్ పెద్దలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగా...ఆ సోదరుల రాకపై ఏమైనా అభ్యంతరాలున్నాయా..? అంటూ వారి రాజకీయ ప్రత్యర్థిగా పేరున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని టీఆర్ ఎస్ అధిష్టానం పెద్దలు అడిగినట్లు సమాచారం. ఈ విషయం లీకై.. నల్లగొండ సహా రాష్ట్రమంతటా దావాహనంలా వ్యాపించింది. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అవన్నీ అధికార పార్టీ - గిట్టనివాళ్ల ప్రచారాలేనంటూ కొట్టిపారేసారు. 2019 ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తాము లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. తామంతా రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తామంటున్నారు.
తాజాగా సీఎల్పీ ఉపనేత - నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు క్లారిటీ ఇచ్చారు. 30ఏళ్లుగా విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ లో కొనసాగుతూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా - మంత్రిగా పనిచేసిన తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ రైతాంగం సమస్యలపైన - మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త - తన ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ హత్య ఘటనపైన - ఇందులో టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల ప్రమేయంపైన - కేసీఆర్ ప్రాజెక్టుల అవినీతిపైన - కుటుంబ పాలనపైన కోమటిరెడ్డి బ్రదర్స్ నాలుగేళ్లుగా నిత్యం పోరాటం సాగిస్తున్నారన్నారు. శాసనసభలో టీఆర్ ఎస్ హత్యా రాజకీయాలను - కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక బడ్జెట్ ను - పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తానన్న భయంతో తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయగా దీనిపై తాను కోర్టు ద్వారా ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నానన్నారు. అలాంటి తాము టీఆర్ ఎస్ లో చేరుతున్నామంటూ ప్రచారం జరుగడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాజకీయంగా తమను దెబ్బతీసే లక్ష్యంతో గిట్టన వారు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు.. తన రాజకీయ నిర్ణయాలను తాను ధైర్యంగా ప్రకటించే స్థాయి తనకుందన్నారు.