టీమిండియా జట్టు సభ్యుల మాదిరి కనిపిస్తారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రముఖుల్ని చూస్తే. హేమాహేమీలుగా ఉన్న వారు ఎవరి ఆట వారు ఆడతారే కానీ కలిసి కట్టుగా ఆడాలన్నదే మర్చిపోయారు. అదే.. తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడో సమస్యగా మారింది. దాన్ని అధిగమించేందుకు అధిష్ఠానం ఎంతగా ప్రయత్నించినా.. ఎన్ని మందులు వేసినా.. ఆ మాయరోగం మాత్రం మానట్లేదు.
ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ మారలేరన్న ఆలోచనకు వచ్చారేమో కానీ.. టీ కాంగ్రెస్ కు చెందిన ముఖ్యనేతలు పలువురిని ఢిల్లీకి పిలిచిన రాహుల్ గాంధీ.. వారిని ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
వరుస పెట్టి నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచిన ట్రాక్ రికార్డు ఉన్న కోమటిరెడ్డి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఆయన ఓటమి చాలామందికిషాకింగ్ గా మారింది. ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ వాళ్లు సైతం.. తమ గెలుపును జీర్ణించుకోలేకపోయారని చెబుతారు.
అలాంటి ఓటమి ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు కోమటిరెడ్డి ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. "వరుసగా నాలుగుసార్లు గెలిచా. 20 ఏళ్లు నిస్వార్థ సేవ చేశా. ఐదోసారి ఓడిపోయే చాన్సే లేదు. రైతుబంధు విషయంలో సీఈసీ రజత్ కుమార్ కేసీఆర్ చేతిలోకి వెళ్లిపోయారు. ఎన్నికల ముందు పొద్దున్నే ప్రభుత్వం రైతుల అకౌంట్‌లో రైతు బంధు వేసింది. కొంత మంది పెద్ద రైతుల ఖాతాల్లో రూ.3 లక్షలు జమయ్యాయి. 20 ఎకరాల రైతుకు కూడా పంట అమ్మితే నికరంగా అంత మిగలదు" అదే ఓటమికి కారణమైందన్నారు.
మరోవైపు కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. "ఆయన సీఎల్పీ నేత హోదా కోసం ప్రయత్నించారు. ఆ హోదాలో పార్టీ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచుతానని అనుకున్నారు. అలా కొంత అసంతృప్తి. ఎన్నికల సమయంలో కుంతియా వ్యవహారం చూసి చాలా బాధపడ్డారు.
మొన్ననే రాజగోపాల్ రెడ్డి.. సోనియా గాంధీని కలిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వదిలి వెళ్లడం లేదని అనుకుంటున్నా. నేను యూత్ కాంగ్రెస్ నుంచి ప్రజలు, పార్టీతో మమేకమయ్యాను కాబట్టి కాంగ్రె్‌సను వదిలి పెట్టలేను. నేనా విషయం చాలాసార్లు చెప్పాను. మా తమ్ముడి వ్యక్తిగత అభిప్రాయంపై నేనెప్పుడూ చర్చించలేదు" అని సమాధానమిచ్చారు.