తెలంగాణలో కాంగ్రెస్ ఒక క్వశ్చన్ గా మారిన వేళలో జరుగుతున్న మనుగోడు ఉప ఎన్నిక.. ఇప్పుడా పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు సంగతి తర్వాత.. తన ఉనికిని కాపాడుకోవటం పైనే ఇప్పుడా పార్టీ పోరాడుతుందని చెప్పాలి. పైకి గెలుపు ధీమాను ప్రదర్శిస్తున్నా.. కనీసం సెకండ్ ప్లేస్ లో నిలిస్తే.. పరువు పోకుండా ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల ఆలోచనగా చెబుతున్నారు. దీంతో.. తన మాటలతో రచ్చ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం ఇప్పుడా పార్టీ అధినాయకత్వం భరిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి కీ రోల్ ప్లే చేయాల్సిన విషయాన్ని గుర్తించిన హైకమాండ్.. ఆయన తల ఎగరేసినా..పట్టించుకోకుండా ఆయన్ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలవటం ద్వారా.. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత ఏమిటన్న విషయాన్ని తాజాగా తెలియజేశారని చెప్పాలి.
మునుగోడు ఉప పోరు వేళ.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు సోనియాగాంధీ నివాసంలో ప్రియాంక గాంధీ సమావేశాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. దీనికి టీ కాంగ్రెస్ కు చెందిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ భేటీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండటం తెలిసిందే. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఉన్న గుర్రుతోనే ప్రియాంక నిర్వహించిన భేటీకి డుమ్మా కొట్టినట్లుగా ప్రచారం జరిగింది.
రేవంత్ ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ ను టేకప్ చేసిన కోమటిరెడ్డికి.. ఢిల్లీ నుంచి ఆకస్మికంగా కాల్ రావటం.. ఆయన్ను కలిసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్న విషయాన్ని కోమటిరెడ్డికి అర్థమయ్యేలా చేశారంటున్నారు. తాజాగా ప్రియాంకతో భేటీ అయిన ఆయన.. తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల గురించి చర్చించినట్లు చెప్పిన ఆయన.. 'ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చిన నన్నుకలవమని ప్రియాంక చెప్పారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలన్న అంశంపై చర్చించాం. ఫంక్షన్ కారణంగా మొన్న మీటింగ్ కు రాలేకపోయానని చెప్పా. కలిసి కట్టుగా పని చేయాలని చెప్పారు.
అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని సలహాల్ని ఇచ్చా'అంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తే.. ప్రియాంకతో భేటీ వేళ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలో మార్పు స్పష్టంగా కనిపించటంతో పాటు.. కొత్త ఉత్సాహంతో ఉన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పాలి. ప్రియాంకతో భేటీ ఎఫెక్టు ఆయన మీద ఎంతకాలం ఉంటుందన్నదే అసలు ప్రశ్న.