కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నా.. వెళ్ల‌లేదు: కోమ‌టిరెడ్డి కామెంట్స్‌

Update: 2022-09-05 02:30 GMT
వినేవాడు వెంగ‌ళ‌ప్ప అయితే.. చెప్పేవాడు చ‌రిత్ర‌కారుడు అవుతాడ‌ని సామెత‌!.. ఇప్పుడు ఇలానే ఉంది.. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ప‌రిస్థితి అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. రాజ‌కీయంగా అనేక ప‌దువులు.. గౌర‌వాలు.. ఇచ్చిన కాంగ్రెస్‌ను వ‌దిలేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ‌గోపాల్‌పై.. అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. కేవ‌లం కాంట్రాక్టుల కోస‌మే ఆయ‌న పార్టీ మారార‌ని ఇప్ప‌టికీ పెద్ద ఎత్తున కామెంట్లు వ‌స్తున్నాయి. అయితే.. ఆయ‌న మాత్రం .. తాను అందుకు కాదు.. ప్ర‌జాస్వామ్యం కోసం.. ప్ర‌జ‌ల కోసం.. తెలంగాణ ఉజ్వ‌ల భ‌విత కోస‌మే పార్టీ మారిన‌ట్టు క‌ల‌రింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. సీఎం కేసీఆర్ పిలిచి.. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నా కారెక్క‌లేద‌ని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలనే రాజీనామా చేశానని తాజాగా రాజగోపాల్రెడ్డి అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను బొందపెట్టాలనే.. ఇప్పుడున్న పరిస్థితులలో అది బీజేపీతోనే సాధ్యమని ఆపార్టీలో చేరార‌ట‌. నల్గొండ జిల్లా గట్టుప్పల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక.. రాజగోపాల్రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదన్నారు. ఇది ఒక యజ్ఞం.. ఒక ధర్మయుద్ధం అని ఆయన పేర్కొన్నారు. డబ్బు సంచులతో టీఆర్ ఎస్ నాయ‌కులు రాజకీయం చేస్తున్నార‌ని మండిపడ్డారు.

మునుగోడులో ఈసారి గెలిచేది ప్రజలే అని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో డబ్బుకు అమ్ముడుపోరన్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాదా.. ఈయ‌న‌ను గెలిపించింది? అనేది ధ‌ర్మ‌సందేహం. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు గెలవ‌లేదా? అనేది చెప్పాలి. ఇక‌, ప‌నిలో ప‌నిగా.. రాజ‌గోపాల్‌.. రేవంత్‌పైనా విరుచుకుప‌డ్డారు. రేవంత్‌రెడ్డికి చరిత్ర లేదన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు చోరీలు చేసేవారని విమ‌ర్శ‌లు గుప్పించారు.

రేవంత్‌రెడ్డి.. ఇప్పటికీ చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ముందు రేవంత్‌రెడ్డి ఫోటో... వెనకాల చంద్రబాబు ఫోటో ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. ``నేను రాజకీయాల్లోకి వచ్చాక... సొంత ఆస్తులు అమ్ముకున్నా. డబ్బుకోసం అమ్ముడుపోయిన వ్యక్తి ఎవరో ప్రజలకి తెలుసు`` అని వ్యాఖ్యానించారు.

మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నా..

కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయానని తనపై వస్తున్న ఆరోపణలను పట్టించుకోనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.  కాంగ్రెస్‌ కార్యకర్తలను బీజేపీలోకి చేర్చుకున్న ఆయ‌న‌.. సీఎం కేసీఆర్‌పై ధ్వ‌జ‌మెత్తారు. సీఎం కేసీఆర్‌ పిలిచి తనకు మంత్రి పదవి ఇస్తానన్నా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదని చెప్పారు. స్వార్థ ప్ర యోజనాల కోసం పార్టీ మారేవాడినైతే ఎప్పుడో మారేవాడినని చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. రాజ‌గోపాల్ వ్యాఖ్య‌లు మ‌రోసారి చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News